మాహీ భాయ్ చేసిన ఆ కామెంట్లే, నాలో కసిని రేపాయి... రుతురాజ్ గైక్వాడ్ కామెంట్స్...

First Published Dec 21, 2021, 10:58 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఆరెంజ్ క్యాప్ గెలిచాడు సీఎస్‌కే యంగ్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20, విజయ్ హాజారే ట్రోఫీల్లోనూ అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చాడు...

విజయ్ హాజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్, ఐదు మ్యాచుల్లో నాలుగు సెంచరీలతో 500+ పరుగులు చేసి దుమ్మురేపాడు...

అయితే నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో మహారాష్ట్ర జట్టు, ఐదింట్లో నాలుగు విజయాలు అందుకున్నా ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయింది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రిటెన్షన్‌లో భాగంగా రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, మొయిన్ ఆలీలతో పాటు రుతురాజ్ గైక్వాడ్‌ను కూడా అట్టిపెట్టుకుంది సీఎస్‌కే...

తాజాగా రుతురాజ్ గైక్వాడ్ తన పర్ఫామెన్స్ వెనక 2020 సీజన్ సమయంలో మాహీ భాయ్ చేసిన కామెంట్లు ఉన్నాయంటూ కామెంట్ చేశాడు...

2020 సీజన్‌లో వరుస పరాజయాలను ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది...

ఓపెనర్ మురళీ విజయ్‌తో పాటు పియూష్ చావ్లా, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి సీనియర్లతో నిండిన జట్టు, స్వల్ప లక్ష్యాలను కూడా ఛేదించలేక చతికిలపడింది...

సీజన్ ఆరంభానికి ముందు రుతురాజ్ గైక్వాడ్ కరోనా బారిన పడడంతో అతని మొదటి మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. రెండో మ్యాచ్ నుంచి మొదటి మూడు మ్యాచుల్లో రుతురాజ్‌ను ఆడించినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.

ఇదే సమయంలో ఎన్ జగదీశన్‌ ఓ మ్యాచ్‌లో 30+ పరుగులు చేసి ఆకట్టుకున్నా, అతనికి తర్వాత మ్యాచ్‌లో చోటు దక్కలేదు. కుర్రాళ్లను ఆడించడం లేదెందుకు? అని ఓ స్పోర్ట్స్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘వారిలో నాకు స్పార్క్ కనిపించలేదు...’ అంటూ కామెంట్ చేశాడు మాహీ...

యువకులకు అవకాశం ఇవ్వకుండా, వారిలో స్పార్క్ లేదని మాహీ చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనం క్రియేట్ చేశాడు. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఆడిన రుతురాజ్ గైక్వాడ్, మూడింట్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు...

‘మాహీ భాయ్ చేసిన కామెంట్లు, నన్ను నేనే ప్రశ్నించుకునేలా చేశాయి. ఈసారి నేనేంటో నిరూపించుకోవాలి, సీఎస్‌కేకి నేను మ్యాచ్ విన్నర్‌గా మారాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను...

అదే మైండ్‌సెట్‌తో ఐపీఎల్ 2021 సీజన్‌లో బరిలో దిగాను. ఆరంభంలో ఫెయిల్ అయినా మాహీ భాయ్, నాకు అండగా నిలిచారు. ఆయనిచ్చిన భరోసాతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలవడం చాలా స్పెషల్... విజయ్ హాజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలు చేయడం సంతోషాన్నిచ్చినా, మా జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకపోవడం కొంత బాధ కలిగించింది...’ అంటూ కామెంట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 635 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, అతి పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే...

రవీంద్ర జడేజాని మొదటి రిటెన్షన్‌గా ఎంచుకున్న సీఎస్‌కే, అతనికి రూ.16 కోట్లు చెల్లించనుంది. అలాగే సెకండ్ రిటెన్షన్ పొందిన కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి రూ.12 కోట్లు చెల్లించనుంది...

మూడో రిటెన్షన్‌గా మొయిన్ ఆలీని ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, అతనికి రూ.8 కోట్లు, నాలుగో రిటెన్షన్‌ దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్‌కి రూ.6 కోట్లు చెల్లించనుంది. వేలంలో రూ.20 లక్షలు దక్కించుకున్న రుతురాజ్, ఈ సారి దానికి 300 రెట్లు అధికమొత్తాన్ని తీసుకోబోతున్నాడు...

click me!