జో రూట్ శతకాల జోరు... విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ రికార్డు సమం, ఇంకోటి కొడితే చాలు...

Published : Jun 13, 2022, 10:58 AM IST

ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్... కెరీర్ పీక్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. గత ఏడాది 7 సెంచరీలతో 1700+ పైగా టెస్టు పరుగులు చేసిన జో రూట్, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మరింత జోరు చూపిస్తూ శతకాల మోత మోగిస్తున్నాడు...  

PREV
18
జో రూట్ శతకాల జోరు... విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ రికార్డు సమం, ఇంకోటి కొడితే చాలు...
Joe Root-Ollie Pope

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో ఇంగ్లాండ్‌కి ఈ ఏడాది తొలి విజయాన్ని అందించాడు జో రూట్. అదే ఫామ్‌ని కొనసాగిస్తూ నాటింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారీ శతకం నమోదు చేశాడు జో రూట్...

28

తొలి ఇన్నింగ్స్‌లో డార్ల్ మిచెల్ 190, టామ్ బ్లండెల్ 106 పరుగులతో రాణించడంతో 553 పరుగుల భారీ స్కోరు చేసింది న్యూజిలాండ్. అయితే ఇంగ్లాండ్ కూడా ధీటుగా సమాధానం ఇస్తోంది...

38

జాక్ క్రావ్లే త్వరగా అవుటైనా అలెక్స్ క్యారీ 67, ఓల్లీ పోప్ 239 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 145 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. జానీ బెయిర్‌స్టో 8 పరుగులకే అవుటైనా కెప్టెన్ బెన్ స్టోన్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుటైయ్యాడు...

48
Joe Root

తన ఫామ్‌ని కొనసాగించిన జో రూట్ 200 బంతుల్లో 25 ఫోర్లతో 163 పరుగులు చేసి మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్‌గా నిలిచాడు. జో రూట్‌కి టెస్టుల్లో ఇది 27వ సెంచరీ కాగా, జనవరి 2021 నుంచి ఏడాదిన్నరలో పదో సెంచరీ...

58
Joe Root

116 బంతుల్లో సెంచరీ చేసిన జో రూట్, తన కెరీర్‌లో ఫాస్టెస్ టెస్టు సెంచరీ నమోదు చేసుకున్నాడు. అలాగే ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల రికార్డును సమం చేశాడు జో రూట్...

68
Joe Root

విరాట్ కోహ్లీ రెండున్నరేళ్ల క్రితం 2019లో టెస్టుల్లో 27వ సెంచరీ చేయగా, స్టీవ్ స్మిత్ 2021 జనవరిలో టీమిండియాలో 27వ సెంచరీ అందుకున్నాడు. ఈ ఇద్దరూ 28వ సెంచరీ అందుకోవడానికి తెగ కష్టపడుతున్నారు...

78
Joe Root

విరాట్ కోహ్లీ 27వ సెంచరీ చేసిన సమయంలో 17 టెస్టు సెంచరీలతో ఆమడ దూరంలో ఉన్న జో రూట్, ఏడాదిన్నరలో 10 సెంచరీలు చేసి మెరుపు వేగంతో టీమిండియా మాజీ కెప్టెన్ రికార్డును సమం చేయడం విశేషం...

88
Joe Root

జో రూట్ ఇదే జోరును కొనసాగిస్తే విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల రికార్డును మాత్రమే కాదు, సునీల్ గవాస్కర్ 34 టెస్టు సెంచరీల రికార్డును అందుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

Read more Photos on
click me!

Recommended Stories