వాళ్ల వల్లే ఓడిపోయాం! మరీ ఇలా చేస్తారనుకోలేదు... టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన...

Published : Jun 13, 2022, 10:36 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో అనుకోకుండా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రిషబ్ పంత్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కూడా లక్కీగా కెప్టెన్‌ అయిపోయాడు. మొదటి రెండు మ్యాచుల్లో కెప్టెన్‌గా మెప్పించినా, భారత జట్టుకి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు రిషబ్ పంత్...

PREV
18
వాళ్ల వల్లే ఓడిపోయాం! మరీ ఇలా చేస్తారనుకోలేదు... టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన...
Image credit: PTI

ఢిల్లీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, వాన్ దేర్ దుస్సేన్ ఇన్నింగ్స్‌ల కారణంగా 7 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా... కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో హెన్రీచ్ క్లాసెస్ మాస్ ఇన్నింగ్స్‌తో పరాజయం పాలైంది...

28
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన యజ్వేంద్ర చాహాల్.. రెండు మ్యాచుల్లో కలిపి ఒకే ఒక్క వికెట్ తీశాడు. అదీకాకుండా 10కి పైగా ఎకానమీతో బౌలింగ్ చేసి భారీగా పరుగులు సమర్పించాడు...

38

మొదటి మ్యాచ్‌లో 2.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 27 పరుగులు సమర్పించిన యజ్వేంద్ర చాహాల్, కటక్‌లో జరిగిన రెండో టీ20లో 4 ఓవర్లలో 49 పరుగులిచ్చి ఓ వికెట్ తీయగలిగాడు. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...
 

48

తొలి మ్యాచ్‌లో యజ్వేంద్ర చాహాల్‌తో 2.1 ఓవర్లే వేయించిన రిషబ్ పంత్, రెండో మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో 19 పరుగులిచ్చిన అక్షర్ పటేల్‌కి మరో ఓవర్ వేయించే సాహసం చేయలేదు. ఏడు బౌలర్లను వాడి వికెట్లను రాబట్టే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు...
 

58

‘భువీ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. మిగిలిన బౌలర్లు కూడా చాలా బాగా బౌలింగ్ చేయడంతో మొదటి 7 ఓవర్లలో మేం, వాళ్లను నియంత్రించగలిగాం. అయితే ఏడో ఓవర్ తర్వాత పరిస్థితి మారిపోయింది...

68
Rishabh Pant

ముఖ్యం 10-11 ఓవర్ల తర్వాత మా బౌలింగ్ సరిగ్గా లేదు. సౌతాఫ్రికా బౌలర్లలాగే మిడిల్ ఓవర్లలో పరుగులిచ్చి వికెట్లు తీయాలని ప్రయత్నించాం, అయితే మా విషయంలో అది వర్కవుట్ కాలేదు...

78

ముఖ్యంగా స్పిన్నర్ల ప్రదర్శన ఏ మాత్రం బాలేదు. వాళ్ల నుంచి మేం ఎంతో ఆశించాం. వచ్చే మ్యాచ్‌లో అయినా వాళ్లు బెటర్ పర్ఫామెన్స్‌తో వస్తారని కోరుకుంటున్నా... బ్యాటింగ్‌లో ఇంకో 10-15 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్...

88
Bhuvneshwar Kumar

మొదటి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించిన భువనేశ్వర్ కుమార్, కటక్ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి బౌలింగ్‌లో ఒంటరి పోరాటం చేశాడు. 3 ఓవర్లలో 17 పరుగులిచ్చిన ఆవేశ్ ఖాన్‌కి మరో ఓవర్ ఇవ్వలేదు రిషబ్ పంత్... 

Read more Photos on
click me!

Recommended Stories