ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వేదిక ఇవ్వనుంది టీమిండియా. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ. అయితే ఈ తేదీల్లో ఒకటి రెండు మార్పులు ఉంటాయని ఖరారు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..
అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు దసరా నవరాత్రి ఉత్సావాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో సెక్యురిటీ కారణాలతో ఈ మ్యాచ్ రీషెడ్యూల్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి..
26
అక్టోబర్ 15న కాకుండా అక్టోబర్ 14నే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగవచ్చని టాక్ వినబడుతోంది. అయితే బీసీసీఐ సెక్రటరీ జై షా, ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ వరల్డ్ కప్ తేదీల్లో మార్పులు ఉంటాయని మాత్రం ఖరారు చేశాడు...
36
‘వరల్డ్ కప్‌లో కొన్ని తేదీల్లో ఒకటి రెండు మార్పులు ఉంటాయి. కొన్ని దేశాలు తేదీలను మార్చాల్సిందిగా రిక్వెస్ట్ చేశాయి. దానికి అనుగుణంగా మార్పులు చేస్తాం. త్వరలో రీషెడ్యూల్ చేసిన మ్యాచుల వివరాలు తెలియచేస్తాం..’ అంటూ తెలిపాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..
46
అక్టోబర్ 5న ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ చూసేందుకు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు ఉచితంగా మంచినీళ్లు సరాఫరా చేయబోతున్నట్టు ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...
56
Indian fans
చలికాలంలో అది కూడా సాయంత్రం చలిలో జరిగే మ్యాచులు చూసేందుకు వచ్చే క్రికెట్ ఫ్యాన్స్‌కి తాగేందుకు మంచి నీళ్లు ఉచితంగా ఇవ్వడం బాగానే ఉంది కానీ సరైన టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తే, ఇంకా బాగుంటుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..
66
Jasprit Bumrah
అలాగే జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కూడా అప్‌డేట్ ఇచ్చాడు జై షా. ‘జస్ప్రిత్ బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అతను ఆడొచ్చు.. అయితే ఈ విషయంలో సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు...’ అంటూ కామెంట్ చేశాడు జై షా..