మహేంద్ర సింగ్ ధోనీ, టీ20 వరల్డ్‌కప్ ఆడాలని అనుకున్నాడు... కానీ అంతలోనే... - మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్

First Published Jul 1, 2021, 11:02 AM IST

ఈ మధ్యకాలంలో టీమిండియాకి ఘనమైన సేవలు అందించిన క్రికెటర్లు ఎవ్వరికీ సరైన వీడ్కోలు దక్కలేదు. దానికి కారణం అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే అని ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. అయితే మాహీ కూడా సరైన ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

భారత సీనియర్ మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ వంటి లెజెండ్స్ రిటైర్మెంట్ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి క్రికెటర్లకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు...
undefined
వీరంతా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో జట్టుకి దూరం కావడం, ఆ తర్వాత జట్టులో స్థానం కోసం చాలా ఏళ్ల పాటు ఎదురుచూసి నిరాశగా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిపోయాయి... దీంతో మాహీపై తీవ్రమైన ట్రోల్స్ కూడా వచ్చాయి.
undefined

Latest Videos


అయితే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ 2020, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాయంత్రం 7 గంటలకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి... రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
భారత జట్టుకి రెండు వరల్డ్‌కప్, మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనకాల చైనా హస్తం ఉందట.. అదేలాగంటే...
undefined
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2020లో టీ20 వరల్డ్‌కప్ జరగాల్సింది. అయితే గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడడం, టీ20 వరల్డ్‌కప్ ఏడాది వాయిదా పడడం జరిగిపోయాయి...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడని మహేంద్ర సింగ్ ధోనీ... ఏడాదిపాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో ధోనీని పక్కనబెట్టి యంగ్ వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లకు అవకాశం ఇస్తూ వచ్చింది బీసీసీఐ...
undefined
‘అవును... మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావించాడు. టీ20 వరల్డ్‌కప్ సజావుగా షెడ్యూల్ ప్రకారం జరిగి ఉంటే, ఆ టోర్నీలో ఆడి రిటైర్మెంట్ ప్రకటించేవాడు...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా 2020 టీ20 వరల్డ్‌కప్‌లో మాహీని సర్‌ప్రైజ్ ప్లేయర్‌గా బరిలో దింపాలని టీమిండియా భావించింది. కానీ అది వాయిదా పడడంతో మాహీ రిటైర్మెంట్ ప్రకటించాడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్.
undefined
2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో కూడా స్లో బ్యాటింగ్, పేలవ ఫామ్ కారణంగా అనేక విమర్శలు ఎదుర్కొన్న మహేంద్ర సింగ్ ధోనీ... 2007 వన్డే వరల్డ్‌కప్‌‌‌లో భారత జట్టు పరాజయం తర్వాత ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు, దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
undefined
తన రిటైర్మెంట్ వీడియోలో 2007 వన్డే వరల్డ్‌కప్ నాటి దృశ్యాలను కూడా జత చేసి రిటైర్మెంట్ వీడియో పోస్టు చేయడం విశేషం. రిటైర్మెంట్ తర్వాత ఆడిన ఐపీఎల్ టోర్నీలో మాహీ టీమ్ సీఎస్‌కే, తొలిసారి ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేకపోవడం విశేషం.
undefined
click me!