Jasprit Bumrah Net Worth 2026: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పేరుగాంచిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మైదానంలో యార్కర్లతో వికెట్లు పడగొట్టడమే కాకుండా, ఆదాయంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు.
బీసీసీఐ కాంట్రాక్ట్ మార్పులు, కోట్ల విలువైన కార్లు, అహ్మదాబాద్‌లో విల్లా.. ఇదీ బుమ్రా రాయల్ లైఫ్‌స్టైల్
టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా మైదానంలో యార్కర్లు వేస్తే ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లు ఎలా ఎగిరిపడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ క్రికెట్‌లో మోస్ట్ డేంజరస్ బౌలర్‌గా పేరుతెచ్చుకున్న బుమ్రా.. మైదానం వెలుపల తన బ్రాండ్ వాల్యూతో భారీగానే సంపాదిస్తున్నాడు.
2026 నాటికి వివిధ రిపోర్టుల, ఫైనాన్షియల్ ట్రాకర్ల అంచనా ప్రకారం బుమ్రా నెట్ వర్త్ సుమారు ₹60 కోట్ల నుంచి ₹80 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. 2013లో చాలా నార్మల్‌గా కేవలం ₹10 లక్షల ఐపీఎల్ డీల్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన బుమ్రా, ఈ రోజు దేశంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ స్టార్లలో ఒకడిగా నిలిచాడు. మరి ఈ కోట్లాది రూపాయిల సంపాదన బుమ్రాకు ఎక్కడి నుంచి వస్తుందో, ఆయన కార్లు, ఆస్తుల సంగతేంటో ఇక్కడ తెలుసుకుందాం.
26
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ శాలరీ: మెగా అమౌంట్ రిటెన్షన్
బుమ్రా ఇన్ కమ్ సోర్సెస్‌లో అన్నింటికంటే బిగ్గెస్ట్ షేర్ ఐపీఎల్ లీగ్ నుంచే వస్తుంది. 2013 నుంచి ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీకి వెన్నెముకగా నిలిచిన బుమ్రాను ఐపీఎల్ 2026 సీజన్ కోసం మేనేజ్‌మెంట్ ఏకంగా ₹18 కోట్లకు రిటైన్ చేసుకుంది. లీగ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ ప్లేయర్ల లిస్టులో బుమ్రా ముందుంటాడు. ప్రతీ సీజన్‌కు వచ్చే ఈ ₹18 కోట్ల ఫిక్స్డ్ శాలరీ ఆయన బ్యాంక్ బ్యాలెన్స్‌ను విపరీతంగా పెంచేసింది.
36
బీసీసీఐ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు
ఇండియన్ క్రికెట్ బోర్డు (BCCI) ఇచ్చే వార్షిక కాంట్రాక్ట్ కూడా బుమ్రాకు ప్రధాన ఆదాయ మార్గం. బీసీసీఐ 2025-26 కాంట్రాక్ట్ సైకిల్‌లో A+ కేటగిరీలో ఉన్నాడు. అత్యున్నత శ్రేణిగా గ్రేడ్ ఏ కేటగిరీని కొనసాగించింది. దీని ప్రకారం బుమ్రా గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. దీని ద్వారా వచ్చే వార్షిక పారితోషికంతో పాటు ప్రతి మ్యాచ్‌కు బోర్డు మ్యాచ్ ఫీజులు కూడా చెల్లిస్తుంది.
• టెస్ట్ మ్యాచ్: ప్రతి మ్యాచ్‌కి ₹15 లక్షలు
• వన్డే మ్యాచ్: ప్రతి మ్యాచ్‌కి ₹6 లక్షలు
• టీ20I మ్యాచ్: ప్రతి మ్యాచ్‌కి ₹3 లక్షలు
ఈ మ్యాచ్ ఫీజులు, పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్‌ల ద్వారానే ఏటా సుమారు ₹3 కోట్ల నుంచి ₹5 కోట్ల దాకా అదనపు ఆదాయం బుమ్రా ఖాతాలో చేరుతుంది.
కేవలం క్రికెట్ గ్రౌండ్ మాత్రమే కాదు, బుమ్రా యాడ్ ఫిల్మ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ప్రపంచంలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. డ్రీమ్ 11, బోట్, అసిక్స్, వన్‌ప్లస్, థమ్స్ అప్, జెప్టో, యిప్పీ, స్కెచర్స్, జాగల్, టాటా మోటార్స్ వంటి టాప్ క్లాస్ బ్రాండ్లకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఒక రిపోర్టు ప్రకారం బుమ్రా దాదాపు 20 రకాల బ్రాండ్లతో కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. ఒక్కో యాడ్ క్యాంపెయిన్ లేదా ఎండార్స్‌మెంట్ డీల్ కోసం బుమ్రా రోజుకు ₹1.5 కోట్ల నుంచి ₹3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. దీని ద్వారా ఏటా ఆయనకు ₹8 కోట్ల నుంచి ₹15 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.
సంపాదించిన డబ్బును బుమ్రా రియల్ ఎస్టేట్, అదర్ డిజిటల్ అసెట్స్‌లో తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సొంత స్వస్థలమైన అహ్మదాబాద్‌లో ఒక లగ్జరీ డిజైనర్ హౌస్ ఉంది. ఈ ఇంటి మార్కెట్ విలువ దాదాపు ₹3 కోట్ల నుంచి ₹4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో పాటు ముంబైలో కూడా బుమ్రాకు ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, ఇతర చోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
66
కళ్ళు చెదిరే బుమ్రా లగ్జరీ కార్ల కలెక్షన్
క్రికెట్ స్టార్లకు కార్లంటే ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుమ్రా గ్యారేజీలో కూడా సూపర్ ఫాస్ట్ అండ్ లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది..
• Mercedes-Maybach S560: అతి ఖరీదైన, లగ్జరీ ఫీచర్లు ఉన్న ఈ కార్ విలువ సుమారు ₹2 కోట్లకు పైమాటే.
• Nissan GT-R: వేగానికి మారుపేరైన ఈ సూపర్ కార్ విలువ కూడా ₹2 కోట్లకు పైగా ఉంటుంది.
• Range Rover Velar: దాదాపు ₹90 లక్షల విలువైన మోస్ట్ రాయల్ ఎస్యూవీ.
• Toyota Innova Crysta, Hyundai Verna: నిత్యం ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండే ఇతర కార్లు.
ఇలా క్రికెట్ మైదానంలో టీమిండియాను గెలిపించే వికెట్ టేకింగ్ బౌలర్‌గా ఎదిగిన బుమ్రా, తన హార్డ్ వర్క్‌తో ఈ స్థాయిలో కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.