వాళ్లిద్దరూ టీమిండియాలో ఎప్పటికీ ఉండిపోరు... జస్ప్రిత్ బుమ్రా, షమీలపై రోహిత్ శర్మ...

First Published Aug 19, 2022, 5:59 PM IST

మిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడే అతి తక్కువ మంది ప్లేయర్లలో మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా కూడా ఉంటారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత మహ్మద్ షమీని టీ20లకు దూరంగా పెట్టింది టీమిండియా. జస్ప్రిత్ బుమ్రా, ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడ్డాడు...

గాయం కారణంగా యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ 2022 టోర్నీలో జస్ప్రిత్ బుమ్రాతో పాటు హర్షల్ పటేల్ కూడా పాల్గొనడం లేదు. వీరి స్థానంలో ఆవేశ్ ఖాన్, అర్ష్‌‌దీప్ సింగ్ వంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ...

Image credit: PTI

సరిగ్గా 10 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం కూడా ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్... టీమిండియాకి ఆసియా కప్ అందించగలరా? బుమ్రా, షమీ లేని లోటు, టీమిండియాపై ఎంత వరకూ పడుతుంది...

‘జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ... ఎప్పటికీ టీమిండియాలోనే ఉండిపోరు కదా. అందుకే కొత్త వాళ్లకు కూడా అవకాశాలు ఇస్తూ ఉండాలి. నేను, రాహుల్ భాయ్ దీని గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం...

టీమిండియాకి పటిష్టమైన రిజర్వు బెంచ్ ఏర్పాటు చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యాం. గాయాలతో పాటు చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని కుర్రాళ్లకు వరుస అవకాశాలు ఇస్తూ వచ్చాం...

Avesh Khan

జట్టుకి అవసరం వచ్చినప్పుడు ఏ ఒక్కరిపైనో ఆధారపడి మ్యాచులు గెలవాలనుకోవడం కరెక్ట్ కాదు. జట్టు మొత్తం కలిసి సమిష్టిగా ఆడితేనే విజయాలు వస్తాయి. అందరూ కలిసి ఆడితేనే మ్యాచులు ఈజీగా గెలవగలరు...

Arshdeep Singh

అందుకే సీనియర్లు, జూనియర్లతో నిండిన టీమ్‌ని తయారుచేస్తున్నాం. ప్రతీ కుర్రాడికి తనని తాను నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలనేదే మా లక్ష్యం... జింబాబ్వేలో ఉన్న ప్లేయర్లలో చాలామంది మొట్టమొదటిసారి అక్కడ ఆడబోతున్నారు...

టీమ్‌కి సెలక్ట్ అయిన ప్రతీ ఒక్కరూ చాలా టాలెంటెడ్ ప్లేయర్లే. వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశానికి ఆడడం ఏ క్రికెటర్‌కి అయినా చాలా గొప్ప విషయమే కదా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

click me!