అతను మామూలోడు కాదు, టీమిండియాకి వరంలా దొరికాడు... ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్ స్టో...

First Published Aug 11, 2021, 9:41 AM IST

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం జస్ప్రిత్ బుమ్రా బ్లాంక్ పర్ఫామెన్స్. అటు బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బుమ్రా, బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు బుమ్రా...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో బుమ్రా, బుమ్రాలా పర్ఫామెన్స్ ఇచ్చి ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కి ఆధిక్యం దక్కేది, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఒత్తిడిలో పడేది కాదు, అన్నింటికీ మించి టీమిండియా కచ్ఛితంగా గెలిచి ఉండేది... 

అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ పర్ఫామెన్స్ కారణంగా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న బుమ్రా... ఆ తర్వాతి మ్యాచ్‌లోనే తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు...

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించి, విలువైన పరుగులు చేశాడు...

‘జస్ప్రిత్ బుమ్రా మామూలోడు కాదు. అతని టాలెంట్ అసాధారణం. ఏ ఫార్మాట్ అయినా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. అతనికి ఏ బ్యాట్స్‌మెన్‌కి ఎలాంటి బంతులు వేయాలో, ఎక్కడ బాల్ వేసి వికెట్ తీయాలో బాగా తెలుసు..

తన బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. అతను ఆడింది 21 టెస్టులే కావచ్చు, కానీ టీమిండియాలో అతను చాలా మార్పులు తీసుకొచ్చాడు..

బుమ్రా కచ్ఛితంగా ఓ వరల్డ్ క్లాస్ బౌలర్. టీ20లతో పాటు వన్డే, టెస్టుల్లో రాణించడం అంటే సులవైన విషయం కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో...

‘ఇండియాలో ఆడిన సిరీస్‌తో పోలిస్తే, ఇప్పటికీ నా పర్ఫామెన్స్‌లో పెద్దగా మార్పు రాలేదు. దీనికి కారణం నేను టెస్టు మ్యాచులు ఎక్కువగా ఆడలేకపోయాను... చాలా గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇస్తే, టెస్టుల్లో కుదురుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది...

టీమిండియాపై ఆడిన నాలుగు టెస్టుల్లో మూడు సార్లు డకౌట్ అయిన జానీ బెయిర్ స్టో... తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేశాడు... జో రూట్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 72 పరుగులు జోడించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో 50 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసిన బెయిర్‌స్టోని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు.  

click me!