భారత ప్లేయర్లకు గ్రేటింగ్ ఆధారంగా ఏడాదికి ఇంత అంటూ పారితోషికం చెల్లిస్తోంది బీసీసీఐ. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లు ఆడే టాప్ స్టార్లకు అత్యధికంగా ఏడాదికి ఏడు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ మొత్తంగా చెల్లిస్తారు.
ఇది కాకుండా మ్యాచు ఫీజు కింద ఆడిన మ్యాచులకు పారితోషికం దక్కుతుంది. ఒక్క టెస్టు మ్యాచుకి 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20 మ్యాచ్ ఆడితే 3 లక్షలు మ్యాచు ఫీజు కింద దక్కుతుంది.
ఇలా 2020 ఏడాదిలో బుమ్రా ఆడిన మ్యాచులు ద్వారా అతనికి 1.38 కోట్ల రూపాయలు మ్యాచ్ ఫీజు రూపంలో దక్కింది. పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వెళ్లిన విరాట్ కోహ్లీ... రెండో టెస్టు ద్వారా వచ్చే 15 లక్షలు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు.
బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్టులో A+ క్యాటగిరిలో కేవలం ముగ్గురు ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా... రోహిత్ గాయంతో వన్డే, టీ20 సిరీస్‌కి దూరం కావడం కూడా బుమ్రాకి కలిసొచ్చింది.
అదీకాకుండా స్లో ఓవర్ రేటు కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే, మూడో వన్డేల్లో టీమిండియా ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. కొన్ని మ్యాచుల్లో కేవలం కెప్టెన్‌కి మాత్రం స్లో ఓవర్ రేటు కోత విధించబడుతుంది.
అయితే కేవలం మ్యాచ్ ఫీజు విషయంలో మాత్రం బుమ్రా, కోహ్లీ కంటే ముందున్నాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా వందల కోట్లు ఆర్జిస్తున్న విరాట్, అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రికెటర్‌లో ప్రపంచ క్రికెటర్లకి కూడా అందనంత ఎత్తులో నిలిచాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న విరాట్ కోహ్లీ... ఏడాదికి 17 కోట్ల రూపాయాల పారితోషికం అందుకుంటూ అత్యధిక ఖరీదైన ఐపీఎల్ ప్లేయర్‌గానూ కొనసాగుతున్నాడు.
మూడు టెస్టులకు దూరం కావడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 2 ర్యాంకును కూడా కోల్పోనున్నాడు విరాట్ కోహ్లీ. స్టీవ్ స్మిత్ ఫెయిల్ అయినా మూడో స్థానంలో ఉన్న కేన్ విలియంసన్ మరో సెంచరీ చేయడంతో టాప్ ర్యాంకుకి ఎగబాకే అవకాశం ఉంది.