అతన్ని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించడం అంత ఈజీ కాదు... జడేజాపై మరోసారి నోరుపారేసుకున్న...

Published : Jun 25, 2022, 01:04 PM IST

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌ల మధ్య మాటల యుద్ధం చాలా రోజులుగా కొనసాగుతూ వస్తోంది. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో జడ్డూని తన టీమ్‌లో ఆడించనని, అతను ఓ ‘బిట్స్ అండ్ పీసెస్ ఆల్‌రౌండర్’ అంటూ మంజ్రేకర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి...

PREV
17
అతన్ని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించడం అంత ఈజీ కాదు...  జడేజాపై మరోసారి నోరుపారేసుకున్న...

సంజయ్ మంజ్రేకర్ కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న రవీంద్ర జడేజా, అతను ఓరల్ డయేరియాతో బాధపడుతున్నాడని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ కామెంట్ల తర్వాత హాఫ్ సెంచరీ చేసిన ప్రతీసారీ బ్యాటును ఖడ్గంలా తిప్పుతూ సెలబ్రేట్ చేసుకోవడం మొదలెట్టాడు రవీంద్ర జడేజా...

27

ఐపీఎల్ 2022 సీజన్‌ని సీఎస్‌కే కెప్టెన్‌గా మొదలెట్టి, ఆల్‌రౌండ్ ఫ్లాప్ షో కనబర్చిన రవీంద్ర జడేజా, సీజన్ మధ్యలోనే గాయంతో తప్పుకున్నాడు. గాయం నుంచి కోలుకుని నెలన్నర తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టులో బరిలో దిగబోతున్నాడు జడ్డూ...

37

టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడుతున్న అతి కొద్ది ప్లేయర్లలో ఒకడైన రవీంద్ర జడేజాని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించడం అంత తేలికయ్యే పని కాదని మరోసారి జడ్డూపై నోరుపారేసుకున్నాడు సంజయ్ మంజ్రేకర్...
 

47

‘దినేశ్ కార్తీక్ రీఎంట్రీ తర్వాత అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఆరు లేదా ఏడో స్థానానికి అతనే కరెక్ట్‌ అని నిరూపించుకుంటున్నాడు. అతను ఆ పొజిషన్లలో ఆడుతున్న విధానం అద్భుతం...

57
Ravindra Jadeja

ఐపీఎల్‌ 2022తో పాటు సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడాడు. అలాగే హార్ధిక్ పాండ్యా కూడా మంచి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో రవీంద్ర జడేజాని టీ20 వరల్డ్ కప్ ఆడించడం అంత తేలికయ్యే పని కాదు...

67
Ravindra Jadeja

ఎందుకంటే జడ్డూ కంటే బెటర్ స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్‌ని ఆస్ట్రేలియా ఆడించేందుకే టీమిండియా మొగ్గు చూపొచ్చు. రిషబ్ పంత్ తర్వాత హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ బ్యాటింగ్‌కి వస్తారు... 

77
Ravindra Jadeja

కాబట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులో చేర్చాలంటే ఎవరో ఓ బ్యాటర్‌ని తీయాల్సి ఉంటుంది. అలా తీయాలంటే జడేజా, వాళ్ల కంటే మంచి ఫామ్‌లో ఉండాలి. సెలక్టర్లకు ఇది పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతుంది... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

click me!

Recommended Stories