లీడ్స్ లోని హెడ్డింగ్లీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన స్టోక్స్.. 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 18 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో అతడు కొట్టిన సిక్సర్.. స్టోక్స్ టెస్టు కెరీర్ లో వందో సిక్సర్ కావడం విశేషం. దీంతో అతడు ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు.