జడ్డూ ప్లేస్‌లో యజ్వేంద్ర చాహాల్! మొదటిసారి దాన్ని వాడిన టీమిండియా! అది సంజూ ఐడియానేనట...

First Published Jan 17, 2023, 1:54 PM IST

అది 2020 డిసెంబర్. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లింది. మొదటి రెండు వన్డేల్లో ఓడినా మూడో వన్డేలో గెలిచి తొలి విజయాన్ని అందుకున్న భారత జట్టు... తొలి టీ20లో మొట్టమొదటిసారిగా కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌‌ని వాడింది... రవీంద్ర జడేజా ప్లేస్‌లో టీమ్‌లోకి చాహాల్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...

Image credit: PTI

కాన్‌బెర్రాలో జరిగిన మొదటి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 1, కెప్టెన్ విరాట్ కోహ్లీ 9, మనీశ్ పాండే 2 పరుగులు చేసి నిరాశపరిచినా కెఎల్ రాహుల్ 51 పరుగులు చేశాడు...

సంజూ శాంసన్ 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేయగా హార్ధిక్ పాండ్యా 16 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అయితే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్, రవీంద్ర జడేజా హెల్మెట్‌కి బలంగా తాకింది. 
 

ఫిజియో వచ్చి పరిశీలించిన తర్వాత తిరిగి బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కి రాలేదు. అతని స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా యజ్వేంద్ర చాహాల్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చింది టీమిండియా...

Sanju Samson and Chahal

తుదిజట్టులో లేని యజ్వేంద్ర చాహాల్, 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. నటరాజన్ కూడా 3 వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా టీమ్‌లోకి వచ్చిన యజ్వేంద్ర చాహాల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...

‘మొదటి టీ20లో రవీంద్ర జడేజా స్థానంలో యజ్వేంద్ర చాహాల్‌ని ఆడించాలనేది సంజూ శాంసన్ ఐడియానే. టీమ్ మేనేజ్‌మెంట్, రవీంద్ర జడేజానే ఆడించాలని అనుకుంది. అతను కూడా ఆడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు...

 అయితే జడ్డూ పూర్తి ఫిట్‌గా లేనప్పుడు కంకూషన్ సబ్‌స్టిట్యూట్ వాడుకుంటే బాగుంటుందని సంజూ సలహా చెప్పాడు. అతనిలో కెప్టెన్ ఉన్నాడని అప్పుడే గమనించా...’ అంటూ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్.. 

Sanju Samson

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో గాయపడిన సంజూ శాంసన్, టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరగబోతున్న వన్డే, టీ20 సిరీస్‌లోనూ సంజూ శాంసన్‌కి చోటు దక్కలేదు..

click me!