ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపించింది : క్యాపిటల్స్ ఆల్ రౌండర్ షాకింగ్ కామెంట్స్

Published : Jun 05, 2022, 12:46 PM IST

IPL 2022: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 లో ఢిల్లీ క్యాపిటల్స్  లీగ్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టింది. తమ చివరి లీగ్ లో ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ.. బెంగళూరును ప్లేఆఫ్ చేర్చింది.   

PREV
17
ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపించింది :  క్యాపిటల్స్ ఆల్ రౌండర్ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్-15లో పడుతూ లేస్తూ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరికి ప్లేఆఫ్స్ రేసులో ఆఖరి మెట్టుమీద  బొక్క బోర్లా పడింది. కీలక మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు, బౌలర్లు  అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు.

27

ప్లేఆఫ్స్ కు ముందు వరకు బెంగళూరుతో సమానంగా నిలిచిన ఢిల్లీ.. చివరి మ్యాచ్ లో నెగ్గితే  కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరేది. కానీ ఈ మ్యాచ్ లో  ముంబై ఇండియన్స్ నెగ్గడంతో  రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్ కు చేరింది. 

37

తమ జట్టు ప్లేఆఫ్స్  చేరకపోవడంపై ఢిల్లీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇందుకు గాను తమకు సిగ్గుగా అనిపించిందని.. ప్లేఆఫ్ కోసం తాము ఎంతో కష్టపడ్డా అందుకు ప్రతిఫలం దక్కలేదని వాపోయాడు. 

47

మార్ష్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. ఈ సీజన్ లో మా హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆటగాళ్లందరినీ చాలా బాగా చూసుకున్నాడు.

57

ఒక నాయకుడిగా మమ్మల్నందరినీ  నడిపించిన ఆయన కోసమైనా మేము ఐపీఎల్ ఫైనల్ చేరాలని అనుకున్నాం.  ముఖ్యంగా రికీ..  ఢిల్లీ కి నేను ఎంత ముఖ్యమైన ఆటగాడినో తెలియజెప్పాడు..’ అని తెలిపాడు. 

67

ఇక ఐపీఎల్-15 ప్రారంభానికి ముందు గాయపడి కొన్ని గేమ్స్ దూరమైన మార్ష్.. తర్వాత కొవిడ్ భారిన పడి దాదాపు రెండు వారాల పాటు మ్యాచులకు దూరమయ్యాడు. తర్వాత తిరిగిచ్చి కీలక ఆటగాడిగా మారాడు. ఈ సీజన్ లో  8 మ్యాచులాడి.. 251 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 

77

గాయం నుంచి కోలుకుని తిరిగి ఢిల్లీ జట్టుకు ఆడిన మార్ష్.. తనకు కొవిడ్ రావడం, ఇతర ఇబ్బందుల వల్ల భారత్ లో తనకేమైనా శాపం తగిలిందా..? అన్న అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories