Yuvraj Singh-Harbhajan Singh:టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తన మాజీ సహచర ఆటగాడు యువరాజ్ సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. యువీ కెప్టెన్ అయ్యుంటే తామంతా..
టీమిండియాకు ఒకప్పుడు నెంబర్ వన్ స్పిన్నర్, ఆల్ రౌండర్లుగా పనిచేసిన వారిలో హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ కీలక సభ్యులు. ఈ ఇద్దరూ మంచి మిత్రులు.
26
అయితే యువరాజ్ కెప్టెన్ అయ్యుంటే మాత్రం తమ కెరీర్లన్నీ మధ్యలోనే ముగిసిపోయేవని.. తామంతా సోమరిపోతుల్లా తయారయ్యేవారమని భజ్జీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
36
భజ్జీ మాట్లాడుతూ.. ‘ఒకవేళ యువీ గనక టీమిండియా కెప్టెన్ అయ్యుంటే మాత్రం మా కెరీర్ లు మధ్యలోనే ముగిసేవి (నవ్వుతూ..). యువీ కెప్టెన్ అయ్యుంటే మేము త్వరగా పడుకుని లేట్ గా నిద్ర లేచేవాళ్లం. మీరు దేశానికి కెప్టెన్ గా ఉన్నప్పుడు స్నేహాన్ని పక్కనబెట్టాలి. ముందు దేశం గురించి ఆలోచించాలి.
46
ఎందుకంటే మేం ఏం ఆడినా మా సామర్థ్యం మీద నమ్మకముంచి ఆడాం. ఏ కెప్టెన్ కూడా మమ్మల్ని జట్టు నుంచి తొలగించినప్పుడు కాపాడలేదు.. జోక్స్ ను కాసేపు పక్కనబెడితే యువీ భారత జట్టుకు కెప్టెన్ అయ్యుంటే గొప్ప సారథి అయ్యుండేవాడని నా అభిప్రాయం. అతడి రికార్డులే యువీ ఏంటో చెబుతున్నాయి.
56
2011 వన్డే ప్రపంచకప్ లో గానీ.. 2007 టీ20 ప్రపంచకప్ లో గానీ అతడి ఆట.. వచ్చిన అవార్డులు, సాధించిన రికార్డులే యువీ గొప్పతనాన్ని సూచిస్తున్నాయి. అవి యువీకి ఎంతగానో గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టాయి...’ అని చెప్పాడు.
66
యువీ-భజ్జీ లు టీమిండియాకు సుదీర్ఘకాలం ఆడారు. ఈ ఇద్దరూ టీమిండియా నెగ్గిన 2007, 2011 ప్రపంచకప్ లలో సభ్యులు. ఐపీఎల్ లో వివిధ జట్ల తరఫున ఆడినా ఈ ఇద్దరూ తమ స్నేహాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.