దాని కోసం ఇండియా సిరీస్ నే వదులుకున్న ఇంగ్లాండ్ స్పిన్నర్.. క్రికెట్ కంటే అదే ముఖ్యమైందంటూ..

Published : Jun 24, 2022, 05:52 PM IST

IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా... జులై 1-4 వరకు ఐదో టెస్టు ఆడి ఆ తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కు ఇంగ్లీష్ స్పిన్నర్ అదిల్ రషీద్ దూరం కానున్నాడు. 

PREV
16
దాని కోసం ఇండియా సిరీస్ నే వదులుకున్న ఇంగ్లాండ్ స్పిన్నర్.. క్రికెట్ కంటే అదే ముఖ్యమైందంటూ..

గతేడాది మిగిలిపోయిన జులై 1-4 మధ్య టెస్టు ముగిసిన తర్వాత భారత జట్టు.. ఇంగ్లాండ్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జులై 7 నుంచి 17 వరకు పరిమిత ఓవర్ల సిరీస్ లు జరుగుతాయి. అయితే ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ ప్రధాన స్పిన్నర్ అదిల్ రషీద్ అందుబాటులో ఉండటం లేదు. 

26
Adil Rashid

ఈ విషయాన్ని స్వయంగా అతడే తెలిపాడు. ఈ రెండు సిరీస్ లతో పాటు ఆ తర్వాత జరుగబోయే యార్క్ షైర్ టీ20 బ్లాస్ట్ క్యాంపెయిన్ కు కూడా అందుబాటులో ఉండనని చెప్పాడు. ఈ మేరకు అతడు తన నిర్ణయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తో పాటు కౌంటీలలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న యార్క్ షైర్ కు కూడా తెలిపాడు. 

36

అదిల్ రషీద్ ఈ కీలక సిరీస్ లను వీడటానికి బలమైన కారణమున్నది. జన్మతహా ముస్లిం అయిన రషీద్.. పవిత్ర పుణ్యస్థలం మక్కాను సందర్శించడానికి వెళ్లనున్నాడు. శనివారం రాత్రి అతడు ఇంగ్లాండ్ నుంచి బయల్దేరతాడు.  సుమారు మూడు వారాల పాటు రషీద్.. హజ్ యాత్రతో  పాటు ఇతర పుణ్యస్థలాలను దర్శించనున్నాడు. ఈ మేరకు అతడు కీీలకమైన ఇండియా సిరీస్ ను కూడా వదులుకున్నాడు. 

46

ఇదే విషయమై రషీద్ స్పందిస్తూ..‘నేను ఇది చేయాలని (మక్కాకు వెళ్లడం) చాలా కాలంగా అనుకుంటున్నాను. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. కానీ ఈ ఏడాది ఎలాగైనా మక్కా వెళ్లాలని నిశ్చయించుకున్నా. ఈ విషయం గురించి ఈసీబీ, యార్క్ షైర్ లకు చెప్పాను. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. ‘నీకు ఎన్నిరోజులు కావాలనుకుంటే అన్ని రోజులు వెళ్లు..’ అని నాతో చెప్పారు. ప్రతి మతం దేనికదే ప్రత్యేకమైందే. ముస్లింగా ఉన్నవాళ్లకు ఇది (హజ్ యాత్ర)  చాలా పెద్ద విషయం. నేను యువకుడిగా ఉన్నప్పట్నుంచే అక్కడికి వెళ్లాలనుకుంటున్నా..’ అని తెలిపాడు. 

56

భారత్ తో సిరీస్ మిస్ అవడం గురించి మాట్లాడుతూ.. ‘నేను దాని గురించి ఆలోచించలేదు. ఇండియా కు వ్యతిరేకంగా ఆడుతున్నాను. నేను వెళ్లకూడదు అనే విషయం నా మైండ్ లోకి రాలేదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ కు సంబంధం లేనిది.ఇది నా నమ్మకానికి సంబంధించిన విషయం..’ అని తెలిపాడు. 

66

శనివారం హజ్ యాత్రకు బయల్దేరబోయే రషీద్.. జులై నాలుగో వారంలో ఇంగ్లాండ్ కు వచ్చే అవకాశముందని తెలిపాడు. ఇండియా సిరీస్ తర్వాత ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ఆ సిరీస్ వరకు తాను అందుబాటులో ఉంటానని రషీద్ చెప్పాడు. ఇక భారత్ తో సిరీస్ కు రషీద్ స్థానంలో మ్యాట్ పార్కిన్సన్ ను తుది జట్టులోకి తీసుకుంది ఇంగ్లాండ్. 

click me!

Recommended Stories