Brett Lee About Shane Warne Death: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణంపై ప్రపంచవ్యాప్తంగా అతడి అభిమానులు శోకసంద్రంలో ఉన్నారు. అభిమానులతో పాటు అతడి సహచర ఆటగాళ్లు కూడా...
ప్రపంచ క్రికెట్ అభిమానులను విషాదంలోకి నెట్టేస్తూ ఈ నెల 4న కన్నుమూసిన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మృతిపై అతడి సహచర ఆటగాడు, మాజీ పేసర్ బ్రెట్ లీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు.
26
Brett Lee
వార్న్ మరణ వార్తలను తాను నమ్మలేదని, తన తండ్రికి ఈ విషయం తెలియగానే ఆయన కూడా కొంతసేపు నిశ్చేష్టుడయ్యాడని తెలిపాడు.
36
బ్రెట్ లీ మాట్లాడుతూ... ‘ఆ రోజు రాత్రి నేను నా తల్లిదండ్రులతో ఉన్నాను. అర్థరాత్రి 1.30 గంటలకు నాకు ఇంగ్లాండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ నుంచి మెసేజ్ వచ్చింది.
46
ఆ మెసేజ్ చూశాక నేను నా కళ్లను నమ్మలేకపోయాను. ఆ విషయం తెలియగానే.. ఇప్పుడు నేనేం చేయాలి..? అనే భావన నాలో మొదలైంది. నేను ఆ వార్త నిజమో కాదో నిర్ధారించుకుందామని అనుకున్నాను.
56
ఇక మరుసటి రోజు ఉదయం మా నాన్న నా దగ్గరికి వచ్చాడు. షేన్ వార్న్ కు మరణం లేదు.. అతడు వార్నీ.. ఆస్ట్రేలియాలో అందరి అభిప్రాయమదే అని చెప్పాడు..’ అని బ్రెట్ లీ తెలిపాడు. వార్న్ తో కలిసి బ్రెట్ లీ ఆస్ట్రేలియాకు అనేక మ్యాచులు ఆడిన విషయం తెలిసిందే.
66
ఈ నెల 4న థాయ్లాండ్ లోని తన విల్లాలో గుండెపోటు రావడంతో వార్న్ మరణించిన విషయం తెలిసిందే. వార్న్ మరణించి మూడు రోజులు కావస్తున్నా థాయ్లాండ్ ప్రభుత్వం మాత్రం ఇంకా అతడి పార్థీవ దేహాన్ని ఆసీస్ కు అప్పగించలేదు.