టీమ్ మొత్తం ఆడి గెలిస్తే, కెప్టెన్‌కి క్రెడిట్ ఇవ్వడం అవసరమా... ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్స్...

First Published Sep 7, 2021, 10:04 AM IST

జట్టు మొత్తం గెలిస్తే, ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం కెప్టెన్‌కే దక్కుతుంది. ఇప్పటికీ వరల్డ్‌కప్ విజయాల్లో మహేంద్ర సింగ్ ధోనీకి దక్కిన క్రెడిట్ విషయంలో గౌతమ్ గంభీర్ అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఇర్ఫాన్ పఠాన్, పరోక్షంగా మాహీకి చురకలు అంటించాడు...

ఇంగ్లాండ్‌లోని ది ఓవల్‌లో 50 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ గెలిచి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్‌లో అత్యధిక విజయాలు అందుకున్న భారత సారథిగానూ రికార్డు క్రియేట్ చేశాడు...

టెస్టుల్లో టీమిండియాకి అత్యధిక విజయాలు, అత్యధిక విదేశీ విజయాలు అందించిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ రికార్డులను అధిగమించిన విరాట్ కోహ్లీపై క్రికెట్ ప్రపంచం నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది...

‘నేను జట్టు మొత్తం కలిసి ఆడితేనే విజయాలు వస్తాయని నమ్ముతాను, అదే నిజం కూడా. కేవలం కెప్టెన్ వల్లే విజయాలు రావు, అయితే చాలామంది కెప్టెన్లకు చాలా విజయాల్లో క్రెడిట్ దక్కింది... 

అలా చూసుకుంటే విరాట్ కోహ్లీ, భారత టెస్టు క్రికెట్ బతికి ఉన్నంతవరకూ కిరీటం దక్కాల్సిందే...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

2007 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటుతోనూ బాల్‌తోనూ రాణించి, ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చూపించి... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు ఇర్ఫాన్ పఠాన్...

అలాగే భారత జట్టు విజయాల్లో కీ రోల్ పోషించిన గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి ప్లేయర్లకు రావాల్సినంత గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు చాలామంది మాజీలు...

ఎమ్మెస్ ధోనీ కారణంగా భారత జట్టుకి దూరమై, తిరిగి టీమ్‌లో ప్లేస్ కోసం చాలాఏళ్లు వేచి చూసిన ఇర్ఫాన్ పఠాన్, సెహ్వాగ్, గంభీర్ వంటి ప్లేయర్లకు... మాహీకి క్రెడిట్ ఇవ్వడం అనవసరమనే భావన ఉంది...

ఆ అసహనాన్ని గౌతమ్ గంభీర్ ప్రత్యక్షంగా వ్యక్తం చేస్తే, ఇర్ఫాన్ పఠాన్ ఇలా ఇన్‌డైరెక్ట్‌గా వ్యక్తం చేశాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

కోహ్లీని పొగడుతూ కూడా మాహీని ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్ తెలివిని, సమయస్ఫూర్తిని కొనియాడుతున్నారు అతని అభిమానులు...

click me!