IPL 2022: గత రెండు సీజన్లుగా టీవీలకే పరిమితమైన ఐపీఎల్.. ఈసారైనా స్టేడియాల్లో ప్రేక్షకుల మధ్య జరుగుతుంది అనుకున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజా హెచ్చరికలు కూడా ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు మహారాష్ట్ర సర్కారు షాక్ ఇవ్వనున్నదా..? గత రెండేళ్ల మాదిరిగానే ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
210
కేంద్ర తాజా హెచ్చరికలు దీనిని రుజువు చేస్తున్నాయి. యూరోపియన్ దేశాలతో పాటు చైనా సహా పలు దక్షిణాసియా దేశాలలో కూడా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
310
అప్రమత్తంగా ఉండాలని, కేసులు పెరిగే అవకాశం ఉండటంతో భారీ జన సందోహాలకు, పెద్ద స్థాయిలో నిర్వహించే మీటింగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది.
410
దీంతో మరో వారం రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-2022 సీజన్ కోసం 50 శాతం ప్రేక్షకులతో నిర్వహించుకోవచ్చునని గతంలో అనుమతులిచ్చిన మహారాష్ట్ర సర్కారు ఇప్పుడు వాటిపై పునరాలోచనలో పడింది.
510
ఇంకా ఐపీఎల్ కు మరో 6 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈనెల 26న చెన్నై సూపర్ కింగ్స్.. కోల్కతా నైట్ రైడర్స్ తో తొలి మ్యాచులో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా హెచ్చరికలు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.
610
స్టేడియంలొకి ప్రేక్షకులను అనుమించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే విషయమై మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే మాట్లాడుతూ ... ‘యూరోపియన్ దేశాలతో పాటు చైనాలో కొత్త కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు హెచ్చరికలు అందాయి. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీంతో మేము జిల్లా అధికారులకు కూడా జాగ్రత్తగా ఉండాలని లేఖలు రాశాం.
710
అయితే ఐపీఎల్ మ్యాచులలో ప్రేక్షకులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. దీనిపై ఇప్పుడే ఏం కామెంట్స్ చేయలేను..’ అని తెలిపారు.
810
ఐపీఎల్ పై మంత్రి సమాధానం దాటవేసినా.. స్టేడియంలోకి ప్రేక్షకుల ఎంట్రీ పై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచనలో పడిందని సమాచారం. గత అనుభవాల దృష్ట్యా జన సమూహాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే ఐపీఎల్ ను నిర్వహిస్తే మంచిదని ప్రభుత్వ వర్గాలు బీసీసీఐ అధికారులకు సూచిస్తున్నట్టు సమాచారం.
910
రాబోయే రెండు మూడు రోజుల్లో దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం వెలువడనున్నది. ముంబై లోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటుగా పూణెలోని ఎంసీఎ లో కూడా ఐపీఎల్ నిర్వహించనున్నారు.
1010
ఈ సీజన్ లో 10 జట్లు 70 లీగ్ మ్యాచులు ఆడనున్నాయి. అయితే ప్లే ఆఫ్స్ ఎక్కడ నిర్వహిస్తారనే దానిమీద ఇంకా స్పష్టత లేదు.