ఆ విషయంలో ఐసీసీ నిబంధనలు కఠినతరం చేస్తే తప్ప.. ఫ్రాంచైజీ క్రికెట్ పై విండీస్ దిగ్గజం లారా వ్యాఖ్యలు

Published : Mar 22, 2022, 01:32 PM IST

IPL 2022 Live Updates: దేశానికో లీగ్ లు పుట్టుకొస్తున్న ఈ   రోజుల్లో ఆటగాళ్లు ఏ రోజు  ఏ ప్రాంచైజీకి ఆడుతున్నారో తెలియడం లేదు. అయితే టీ20 మోజులో పడి సాంప్రదాయ టెస్టు క్రికెట్ ను పక్కనబెడుతున్న యువ క్రికెటర్లపై లారా ఆవేదన వ్యక్తం చేశాడు. 

PREV
17
ఆ విషయంలో ఐసీసీ నిబంధనలు కఠినతరం చేస్తే తప్ప.. ఫ్రాంచైజీ క్రికెట్ పై విండీస్ దిగ్గజం లారా వ్యాఖ్యలు

Brian Laraటీ20 క్రికెట్ విస్తృతి పెరిగిన నేపథ్యంలో చాలా మంది క్రికెటర్లు టెస్టు క్రికెట్ కు రిటైర్ చెప్పి కేవలం పరిమిత ఓవర్ల ఆటకే పరిమితమవుతున్నారు. అయితే ఈ రకమైన ధోరణి ప్రమాదకరమని అంటున్నాడు విండీస్ మాజీ సారథి బ్రియాన్ లారా..

27

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ కోచ్ తో పాటు స్ట్రాటజిక్ అడ్వైజర్ గా నియమితుడైన లారా ఓ  మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దేశం కోసం ఆడటమే క్రికెటర్ల ప్రథమ కర్తవ్యం అయి ఉండాలి. 

37

నేను  నా కెరీర్ మొత్తం విండీస్ తరఫునే ఆడాను.  నాకు కూడా చాలా అవకాశాలొచ్చాయి.  కానీ నేను దేశం కోసమే ఆడాలని నిశ్చయించుకున్నాను. యువ క్రికెటర్లు టెస్టు క్రికెట్ ను వదలడం బాధాకరం. 

47

దీనిని నియంత్రించాలంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. తప్పకుండా  కొన్ని రూల్స్ ను ప్రవేశపెట్టాలి.  ఒక దేశం తరఫున ఇన్ని మ్యాచులు ఆడితే  ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటానికి వీళ్లేదని  రూల్ పెట్టాలి.  అలా అయితేనే  టెస్టు క్రికెట్ ను బ్రతికించినవాళ్లవుతారు..’ అని తెలిపాడు. 

57

ఇక ఐపీఎల్  లో తాను  బ్యాటింగ్ కోచ్ గా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్  కోచింగ్ సహచరుడు ముత్తయ్య మురళీధరన్ తో పాటు ఇటీవలే కన్నుమూసిన షేన్ వార్న్ గురించి కూడా లారా మాట్లాడాడు. 

67

‘నేను నా అంతర్జాతీయ కెరీర్ లో మురళీతో చాలా సార్లు తలపడ్డాను. ఒక బౌలర్ గానే కాకుండా  కోచ్ గా కూడా గొప్పగా రాణిస్తున్నాడ’ని చెప్పుకొచ్చాడు. 

77

షేన్ వార్న్ గురించి స్పందిస్తూ... ‘మేమిద్దరం  కూడా  అంతర్జాతీయ కెరీర్ లో  పోటీ పడ్డాం. అయితే మ్యాచ్ ముగిశాక వార్న్ నా దగ్గరికి వచ్చి  కలిసి తాగేవాడు.  గ్రౌండ్ లో జరిగిన విషయాలేవీ అక్కడ చర్చించేవాడు కాదు.  ఒక కామెంటేటర్ గా కూడా వార్న్ తనదైన ముద్ర వేశాడు’ అని తెలిపాడు.

click me!

Recommended Stories