ఐపీఎల్ 2020 సీజన్‌లో పూర్ షో తర్వాత 2021 సీజన్‌లో ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చి... నాలుగోసారి టైటిల్ గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్‌కే విజయంలో కీ రోల్ పోషించిన ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్‌లో వేరే జట్ల తరుపున ఆడబోతున్నారు..
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓపెనర్లుగా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లిసిస్... ఏడు సార్లు 50+ భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు క్రియేట్ చేశారు. సీఎస్‌కేకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన...
211
రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలవగా, ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి అవుటైన ఫాఫ్ డుప్లిసిస్ 633 పరుగులు చేసి 2 పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్ మిస్ అయ్యాడు...
311
ఒకే సీజన్‌లో ఒకే టీమ్‌కి సంబంధించిన ఇద్దరు ఓపెనింగ్ ప్లేయర్లు 600+ స్కోర్లు చేయడం ఇదే తొలిసారి కాగా, ఈ ఇద్దరూ సీజన్‌లో 756 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
411
ఫాఫ్ డుప్లిసిస్‌ని ఐపీఎల్ మెగా వేలంలో రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2022 సీజన్‌కి కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే...
511
డుప్లిసిస్ వేరే జట్టుకి వెళ్లిపోవడంతో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సీఎస్‌కే తరుపున ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయంపై స్పందించాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...
611
‘రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనింగ్ చేసేందుకు సీఎస్‌కే దగ్గర ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. న్యూజిలాండ్ ఓపెనర్ డివాన్ కాన్వే నిలకడగా పరుగులు చేయడంలో దిట్ట...
711
అతనికి ముంబై, మహారాష్ట్ర పిచ్‌లపై రాణించడం పెద్ద కష్టంగా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ పిచ్‌లను పోలి ఉంటాయివి. కాబట్టి కాన్వేని గైక్వాడ్‌తో ఓపెనింగ్ చేస్తే బెటర్...
811
ఒకవేళ కాన్వేని ఓపెనింగ్ పంపడం ఇష్టం లేకపోతే రాబిన్ ఊతప్పను పంపితే బెటర్. ఊతప్పకి ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. భారీ షాట్స్ ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు.
911
రాబిన్ ఊతప్పను ఓపెనర్‌గా ఎంచుకుంటే మహీశ్ తీక్షణతో ఓపెనింగ్ స్పెల్ వేయిస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మహారాష్ట్ర పిచ్‌లపై ఎక్స్‌ట్రా పేస్ రాబట్టాలంటే ఆడమ్ మిల్నే లాంటి బౌలర్ కూడా అవసరం...
1011
బ్రావో, మొయిన్ ఆలీలకు తుది జట్టులో ప్లేస్ తప్పక ఉంటుంది. మిస్టరీ స్పిన్నర్ తీక్షణ, జడేజా, మొయిన్ ఆలీలకు తుదిజట్టులో చోటు దక్కితే సీఎస్‌కే స్పిన్ విభాగం బలంగా మారుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...
1111
మార్చి 26న వాంఖడే స్టేడియంలో గత సీజన్ రన్నరప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత మార్చి 31న లక్నో సూపర్ జెయింట్స్, ఏప్పిల్ 3న పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులు ఆడుతుంది సీఎస్‌కే..