అజింకా రహానే బౌలర్ల కెప్టెన్... విరాట్ కోహ్లీలా కాదు... ఇషాంత్ శర్మ కామెంట్...

First Published Dec 23, 2020, 4:21 PM IST

తొలి టెస్టు ఘోర పరాజయ భారాన్ని మోస్తూ స్వదేశానికి బయలుదేరాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ లేకుండానే ఆస్ట్రేలియాలో మూడు టెస్టులు ఆడబోతోంది టీమిండియా. ఈ టెస్టులకు వైస్ కెప్టెన్ అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. రెండో టెస్టుకి ముందు రహానేలో కాన్ఫిడెన్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు, కొందరు క్రికెటర్లు. 

తొలి టెస్టు మూడో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై, టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రికార్డు క్రియేట్ చేసిన టీమిండియా, బాక్సింగ్ డే టెస్టులో గెలిచి ఆ పరాభవాన్ని మరిచిపోవాలని భావిస్తోంది.
undefined
కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోయినా యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉన్న జట్టుతో సంచలనాలు సృష్టించాలని భావిస్తున్నాడు తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే...
undefined
గాయం కారణంగా ఆసీస్ టూర్‌కి దూరంగా ఉన్న ఇషాంత్ శర్మ... అజింకా రహానే బౌలర్ల కెప్టెన్ అంటూ కితాబిచ్చాడు...
undefined
‘అజింకా రహానే బౌలర్ల కెప్టెన్. అతను బౌలర్లను బాగా నమ్ముతాడు... విరాట్ కోహ్లీ లేనప్పుడు బౌలర్లను ఎలాంటి ఫీల్డింగ్ కావాలని అడిగి, ఫీల్డ్ సెట్ చేసేవాడు...
undefined
రహానే, నేను కలిసి చాలా మ్యాచులు ఆడాం... ఎలాంటి ఫీల్డింగ్ కావాలి? ఎప్పుడు బౌలింగ్ చేయాలనుకుంటున్నావు? బౌలింగ్ కొనసాగించాలని అనుకుంటున్నావా... అంటూ బౌలర్లకు, వారి అభిప్రాయాలకు విలువ ఇచ్చేవాడు...
undefined
ప్రత్యర్థి భాగస్వామ్యాలను నిర్మిస్తున్నప్పుడు, లేదా పిచ్ బౌలర్లకు సహకరించనప్పుడు... ఫీల్డర్లు ఉద్వేగానికి లోనయినప్పుడు... ఒక్క ప్లేయర్ ఎనర్జీ సీన్ మొత్తం మార్చేయగలదు...
undefined
విరాట్ కోహ్లీ అలాంటి ఎనర్జీని మైదానంలో సృష్టిస్తాడు. అది అందరి వల్ల కాదు. అయితే రహానే చాలా కూల్ అండ్ కామ్. అతను జట్టులో కామ్ ఎనర్జీ నింపుతాడు...
undefined
ఎలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో అయినా కూల్‌గా ఉండడం రహానేకి చెల్లింది... బౌలర్లతో కమ్యూనికేట్ చేయడంలో రహానే దిట్ట...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇషాంత్ శర్మ...
undefined
విరాట్ కోహ్లీ గైర్హజరీతో రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే... రెండింట్లోనూ భారత జట్టుకు విజయాలను అందించాడు...
undefined
అజింకా రహానే కెప్టెన్సీలో భారత జట్టు ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లో ఒకటి ఆఫ్ఘనిస్తాన్‌పై కాగా, రెండోది ఆస్ట్రేలియాపైనే...
undefined
రెండో టెస్టుకి నాయకత్వం వహించబోతున్న అజింకా రహానే చాలా తెలివైన ప్లేయర్‌ అని, ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో భారత జట్టును ఎలా నడిపించాలో అతనికి బాగా తెలుసని చెప్పాడు ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్.
undefined
ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవాలంటే విరాట్ కోహ్లీలాగే దూకుడుగా, ఆవేశంగా ప్రవర్తించాలని రహానే భావిస్తాడేమో... అయితే అది ఏ మాత్రం మంచిది కాదని, తనలాగే ఉంటే సరిపోతుందని సలహా ఇచ్చాడు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్.
undefined
అజింకా రహానే కంటే రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ ఇవ్వాలని ఇర్పాన్ పఠాన్ లాంటి క్రికెటర్లు సూచిస్తే... టెస్టు జట్టులో స్థిరమైన చోటు కూడా దక్కించుకోలేకపోతున్న రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్సీ ఎలా చేయగలడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ లాంటి వాళ్లు ప్రశ్నించారు.
undefined
click me!