బాక్సింగ్ డే టెస్టుకి కూడా డేవిడ్ వార్నర్ దూరం... భారత జట్టు పోరాడగలదా?

First Published Dec 23, 2020, 3:47 PM IST

తొలి టెస్టులో ఘోర పరాభవం నుంచి కోలుకుంటున్న టీమిండియాకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి వినిపిస్తున్న ఓ న్యూస్ కాస్త ఊరట కలిగిస్తోంది. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్... బాక్సింగ్ డే టెస్టులో కూడా పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా.

ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియా, మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్ డే టెస్టు ఆడబోతోంది...
undefined
గాయం కారణంగా టీ20 సిరీస్‌తో పాటు మొదటి టెస్టుకి కూడా దూరంగా ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, బాక్సింగ్ డే టెస్టు కూడా ఆడడం లేదు...
undefined
వార్నర్ గజ్జల్లో అయిన గాయం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతనికి విశ్రాంతినిస్తున్నట్టు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా...
undefined
గాయం కారణంగా పొట్టి ఫార్మాట్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మతో పాటు డేవిడ్ వార్నర్ కూడా సిడ్నిలో జరిగే మూడో టెస్టులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది..
undefined
అలాగే రెండో టీ20 మ్యాచ్‌లో గాయపడిన ఆసీస్ పేసర్ సీన్ అబ్బాట్ కూడా రెండో టెస్టుకి అందుబాటులో ఉండడం లేదు...
undefined
గాయం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ అబ్బాట్ నివసిస్తున్న సిడ్నీలో కరోనా కేసులు విపరీతంగా ఉండడంతో అతను రెండో టెస్టుకి దూరంగా ఉంటున్నాడు...
undefined
డేవిడ్ వార్నర్, అబ్బాట్ ఇద్దరూ బయో సెక్యూలర్ లైన్ దాటి బయటికి వెళ్లి, ఫిట్‌నెస్ సాధించారని... అందుకే వారికి క్వారంటైన్ అవసరమని చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా, రెండో టెస్టుకి వారిని దూరంగా ఉంచుతున్నట్టు తెలిపింది.
undefined
కరోనా నిబంధనల ప్రకారం ఏ క్రికెటర్ అయినా బయో సెక్యూలర్ పరిధి దాటి బయటికి వెళితే, అతను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపిన తర్వాత లోపలికి వచ్చేందుకు అనుమతి ఉంటుంది...
undefined
మరోవైపు చివరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత క్రికెటర్ రోహిత్ శర్మ, సిడ్నీలోని హోటెల్‌లోనే క్వారంటైన్‌లో గడుపుతున్నాడు....
undefined
click me!