రెండేళ్ల పాటు ఖాళీ కడుపుతో పడుకున్న ఇషాన్ కిషన్... చివరికి తల్లి నిర్ణయంతో...

First Published Mar 16, 2021, 3:55 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో అదరగొట్టి, ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్. రెండో టీ20లో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్, ‘పియర్ లెస్’ బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. 

తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి, హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే చిన్నతనంలో ఇషాన్ కిషన్ క్రికెట్ కోసం చాలా కష్టాలు అనుభవించాడట.
undefined
ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండేది పాట్నా. అయితే 12 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో సత్తా చాటిన ఇషాన్ కిషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తరుపున డిస్ట్రిక్ టోర్నమెంట్ ఆడేందుకు ఎంపికయ్యాడు...
undefined
క్రికెట్‌లో మంచి స్థాయికి ఎదగాలంటే జార్ఖండ్ తరుపున ఆడాలని చెప్పడంతో మరో గతి లేక, ఇషాన్ కిషన్‌ను పొరుగు రాష్ట్రానికి పంపించాడు అతని తండ్రి ప్రణవ్ కుమార్ పాండే...
undefined
‘ఇషాన్ కిషన్‌ను జార్ఖండ్ పంపించడానికి ముందుగా వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు. అయితే చాలారోజుల పాటు ఆమెతో మాట్లాడి ఎలాగోలా ఒప్పించాం. మాకు కూడా 12 ఏళ్ల పిల్లాడిని తెలియని రాష్ట్రానికి పంపించాలంటే భయమేసింది...
undefined
కానీ ఇషాన్ కిషన్ మాత్రం అక్కడికి వెళ్లాల్సిందేనంటూ మొండిపట్టు పట్టాడు. జార్ఖండ్‌తో మరో నలుగురు సీనియర్లతో కలిసి రూమ్ షేర్ చేసుకునేవాడు కిషన్...
undefined
మిగిలిన నలుగురు సీనియర్లు కావడంతో నీళ్లు పట్టడం, రూమ్ క్లీన్ చేయడం వంటి పనులన్నీ కిషన్‌తో చేయించేవాళ్లు. కిషన్‌కి వండుకోవడం రాదు, కొన్నిసార్లు క్రికెట్ ఆడి, వచ్చేసరికి చాలా లేటు అయ్యేది...
undefined
అప్పటికే రూమ్ మేట్స్, వండుకుని తిని పడుకునేవాళ్లు. చేసేదేమీలేక కిషన్, డిన్నర్ చేయకుండానే నిద్రపోయేవాడు. కానీ ఎప్పుడూ మాకు ఆ విషయం చెప్పలేదు...
undefined
రాత్రి సమయాల్లో చిప్స్, కోక్ వంటి తింటూ కడుపు నింపుకునేవాడు. మేం అడిగితే, డిన్నర్ చేసేశానని చెప్పేవాడు. రెండేళ్ల తర్వాత మాకు విషయం తెలిసింది...
undefined
వెంటనే మేం కూడా రాంఛీ వచ్చేయాలని వాళ్ల అమ్మ పట్టుబట్టింది. దాంతో చేసేదేమీలేక రాంఛీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, పూర్తిగా ఇక్కడికి వచ్చేశాం...’ అంటూ ఇషాన్ కిషన్ చిన్ననాటి సంగతులను చెప్పుకొచ్చాడు అతని తండ్రి పాండే.
undefined
భారత అండర్ 19 జట్టును, 2016 అండర్-19 వరల్డ్‌కప్‌ జట్టుకు నాయకత్వం వహించాడు ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఆడిన రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ టీమ్‌లోకి ఎప్పుడో వచ్చేసినా, ఇన్నాళ్లకు జార్ఖండ్ కెప్టెన్‌కి అవకాశం దక్కింది...
undefined
‘వాడు క్రికెట్ బాగా ఆడుతున్నాడని తెలిసిన తర్వాత చదువు ఎలాగో రాదు... ఇలాగైనా స్పోర్ట్స్ కోటాలో మావోడికి ఓ ప్రభుత్వం ఉద్యోగం వస్తే చాలు’ అని అనుకున్నానని చెప్పుకొచ్చాడు ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే.
undefined
click me!