ఇక పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని, అతడు కోలుకుంటున్నాడని డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతడి ఆరోగ్యం మెరుగవుతున్నదని, అతడిని ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డ్ కు మార్చినట్టు చెప్పాయి. పంత్ పూర్తిస్థాయిలో కోలుకునేదాకా మ్యాక్స్ హాస్పిటల్ లోనే చికిత్స ఉంటుందని పేర్కొన్నాయి.