హార్ధిక్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలనుకుంటే అది చాలా కీలకం : ఇర్ఫాన్ పఠాన్

Published : Jan 02, 2023, 12:52 PM IST

Hardik Pandya: టీ20 ప్రపంచకప్ లో భారత్ ఓటమి  టీమిండియా సెలక్టర్లతో పాటు బీసీసీఐకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.   వయసు మీద పడుతున్న రోహిత్ శర్మను తప్పించి  కొత్త కెప్టెన్ వేటలో పడాల్సి వచ్చింది. 

PREV
17
హార్ధిక్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలనుకుంటే  అది చాలా కీలకం : ఇర్ఫాన్ పఠాన్

రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా  వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు  సెమీస్ లోనే ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.  దీంతో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మపై కూడా అభిమానులు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.  ఐసీసీ ట్రోఫీ తీసుకురావడంలో  ఇద్దరూ విఫలమయ్యారు. 
 

27

ప్రపంచకప్ వైఫల్యంతో పాటు వయో భారం కారణంగా రోహిత్  పొట్టి ఫార్మాట్ నుంచి  తప్పుకునేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాకపోయినా   శ్రీలంకతో రేపటి నుంచి మొదలుకాబోయే టీ20 సిరీస్ లో రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఆడటం లేదు

37

అదీగాక  సారథిగా హార్ధిక్ పాండ్యాను నియమించడం, కొత్త రక్తాన్ని జట్టుకు ఎక్కించే పనిలో భాగంగా యువ ఆటగాళ్లనే జట్టుకు ఎంపిక చేయడంతో  టార్గెట్ - 2024 (టీ20 ప్రపంచకప్) గా  టీమ్ మేనేజ్మెంట్ సాగుతుందనే వాదనలూ ఉన్నాయి.  

47
Image credit: PTI

అయితే  రోహిత్ ను కాదని పాండ్యాను లాంగ్ టైమ్ కెప్టెన్ ను చేస్తారా..?  చేస్తే అది ఎప్పుడు..? అనే చర్చ ప్రస్తుతం భారత క్రికెట్ లో జోరుగా సాగుతోంది. ఈ చర్చకు కొనసాగింపా అన్నట్టు.. తాజాగా  భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్యాను  రోహిత్ వారసుడిగా  చేయాలనుకుంటే  టీమిండియా.. అతడి ఫిట్నెస్ ను దృష్టిలో ఉంచుకోవాలని  అంటున్నాడు.
 

57

 ఇటీవల  ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తో పాటు జాతీయ జట్టుకు కూడా ఇప్పటికే పలు మ్యాచ్ లలో   హార్ధిక్ పాండ్యా  సారథిగా  చేశాడు. మంచి మార్కులు కూడా పడ్డాయి.  ప్రస్తుతం పాండ్యా తన కెరీర్ లోనే  అత్యున్నత స్థితిలో కనబడుతున్నాడు. 
 

67

ఇక అతడి కెప్టెన్సీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ఐపీఎల్ లో  అదరగొట్టాడు. సారథి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.  ఒకవేళ భారత జట్టు  అతడిని సుదీర్ఘకాలం కొనసాగించాలనుకుంటే మాత్రం పాండ్యా పిట్నెస్ మీద  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టీ20లతో  పాటు వన్డేలలో కూడా అతడే వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.

77

సమీప భవిష్యత్ లో  రోహిత్ తర్వాత వన్డేలలో కూడా అతడే సారథిగా అయ్యే అవకాశాలు మెండు.  దీంతో అతడి మీద  వర్క్ లోడ్ పెరిగే  ప్రమాదం ఉంది. అందుకే టీమిండియా ముందు అతడి ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలి..’ అని వ్యాఖ్యానించాడు. 

click me!

Recommended Stories