యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ... అరుదైన జాబితాలో చేరిన ఇషాన్ కిషన్...

First Published Dec 11, 2022, 3:52 PM IST

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్... డబుల్ సెంచరీతో రికార్డుల దుమ్ము దులిపాడు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా, అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డులు క్రియేట్ చేసిన ఇషాన్ కిషన్.. ఓ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు...

ishan

రెండో వన్డేలో ఇషాన్ కిషన్ ఒక్కడే 210 పరుగులు చేస్తే, బంగ్లా టీమ్ మొత్తం కలిసి 182 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అయితే వన్డే మ్యాచ్‌లో ఓ బ్యాటర్‌ చేసిన స్కోరుని, టీమ్ మొత్తం కలిసి అందుకోలేకపోయింది. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్...

ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ (రెండు సార్లు) మాత్రమే వన్డేల్లో ఈ ఘనత సాధించారు. 2003 వన్డే వరల్డ్ కప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 151 బంతుల్లో 18 ఫోర్లతో 152 పరుగులు చేశాడు సచిన్ టెండూల్కర్. ఇదే మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ 119 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు..

గంగూలీ, సచిన్ సెంచరీల కారణంగా టీమిండియా 311 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యఛేదనలో నమీబియా 42.3 ఓవర్లలో 130 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సచిన్ స్కోరు కేంటే 22 పరుగులు తక్కువగా చేసింది నమీబియా టీమ్...

2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 85 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెహ్వాగ్ 63, గంగూలీ 30 పరుగులు చేసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 49.3 ఓవర్లలో 276 పరుగులకి ఆలౌట్ అయ్యింది... ఈ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 27.3 ఓవర్లలో 76 పరుగులకి ఆలౌట్ అయ్యింది... యువీ కంటే 24 పరుగులు తక్కువ చేసింది బంగ్లా...

శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు చేసి వన్డేల్లో అద్వితీయ రికార్డు క్రియేట్ చేశాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు రోహిత్. బంగ్లా 405 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 43.1 ఓవర్లలో 251 పరుగులకి ఆలౌట్ అయ్యింది... రోహిత్ కంటే 13 పరుగులు తక్కువగా చేసింది బంగ్లాదేశ్.

2018లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్‌లో అంబటి రాయుడు 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. 378 పరుగుల భారీ లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 153 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ చేసిన పరుగుల కంటే 9 పరుగులు తక్కువగా చేసింది విండీస్...

ishan

తాజాగా ఇషాన్ కిషన్ 210 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇషాన్ కిషన్ కంటే 28 పరుగులు తక్కువగా చేసింది బంగ్లా. రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఇషాన్ కింగ్... నలుగురు కూడా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడడం విశేషం... 

click me!