ఐపీఎల్ 2022 మెగా వేలంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న భారత యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్. శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్ వంటి సీనియర్లు అందుబాటులో ఉన్నా, ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం పుష్కలంగా ఉంది...
ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచుల్లో 516 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...
210
ఐపీఎల్ 2021 సీజన్‌లో 10 మ్యాచుల్లో మాత్రమే ఇషాన్ కిషన్‌కి అవకాశం దక్కింది. 10 మ్యాచుల్లో 241 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు...
310
‘ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు సీజన్లలోనూ గబ్బర్ పర్ఫామెన్స్ సాలిడ్‌గా ఉంది. అదీకాక అతనికి విపరీతమైన అనుభవం ఉంది...
410
ఇప్పుడు అతని అనుభవం, ఐపీఎల్ జట్లకి చాలా అవసరం. ప్రతీ సీజన్‌లో 450-500 పరుగులు ఈజీగా చేసేస్తున్నాడు. కాబట్టి శిఖర్ ధావన్‌కి మంచి ధర దొరకడం ఖాయం...
510
నాకు తెలిసి రాజస్థాన్ రాయల్స్ మినహా ప్రతీ జట్టుకి శిఖర్ ధావన్ అవసరం ఉంది...’ అంటూ శిఖర్ ధావన్ గురించి, తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్...
610
‘ఇషాన్ కిషన్‌ను ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ముంబై ఇండియన్స్, అతన్ని ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా వాడింది...
710
ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ కూడా కావడంతో ‘త్రీ ఇన్ వన్’ ప్లేయర్‌గా పనికొస్తాడు. టాపార్డర్‌లో, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దొరకడం ప్రతీ జట్టుకీ అదృష్టమే...
810
నా అంచనా ప్రకారం ఇషాన్ కిషన్ ఈజీగా రూ.15-17 కోట్ల వరకూ దక్కించుకోవచ్చు. అతనికి ఇంతే వస్తుందని చెప్పడం కష్టం కానీ ఫ్రాంఛైజీలు పెట్టే ప్రతీ కోటీకి పరిహారం చెల్లించగల ప్లేయర్ అతను...
910
ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్‌లో రిషబ్ పంత్ కంటే ఎక్కువగా సెడ్జింగ్ కూడా చేస్తాడు... కాబట్టి జట్టులో ఉత్సాహం నింపగల ప్లేయర్...’ అంటూ వివరించాడు రవిచంద్రన్ అశ్విన్...
1010
ఇషాన్ కిషన్ కోసం ముంబై ఇండియన్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు పోటీపడే అవకాశం ఉంది...