ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త కెప్టెన్ కోసం చూస్తున్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆర్‌సీబీని నడిపించే తర్వాతి సారథి ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది...
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును, ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫైనల్ చేర్చిన యంగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కి ఆర్‌సీబీ కెప్టెన్సీ దక్కవచ్చని టాక్ నడిచింది...
210
అలాగే 2016 సీజన్ ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్, ఆర్‌సీబీ తర్వాతి కెప్టెన్ అవుతాడంటూ ప్రచారం జరుగుతోంది...
310
ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని కెప్టెన్‌గా తెచ్చుకునేందుకు ఆర్‌సీబీ ఏకంగా రూ.20 కోట్లు పక్కనబెట్టిందని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి...
410
బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి ఆర్‌సీబీ కెప్టెన్సీ దక్కవచ్చని అంటున్నాడు ఆర్‌సీబీ మాజీ కోచ్ డానియల్ విటోరి...
510
‘నా ఉద్దేశం ప్రకారం ఆర్‌సీబీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను అట్టిపెట్టుకోవడానికి అతనికి కెప్టెన్సీ ఇవ్వాలనే ఆలోచన కూడా కారణం కావచ్చు...
610
మెల్‌బోర్న్ స్టార్స్‌కి కెప్టెన్‌గా అతను బాగానే రాణించాడు. కోహ్లీలాగే మ్యాక్స్‌వెల్ కూడా క్రీజులో ఫుల్లు ఎనర్జీతో కదులుతాడు. జట్టులో ఉత్సాహం నింపుతాడు...
710
జట్టును నడిపించగల సత్తా ఉన్న ప్లేయర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఆర్‌సీబీ మొదటి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. విరాట్ కోహ్లీ కూడా మ్యాక్స్‌వెల్‌కే కెప్టెన్సీ ఇవ్వాలని కోరవచ్చు...
810
విరాట్ కోహ్లీకి ఆర్‌సీబీతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. అతను చెబితే, మ్యాక్స్‌వెల్‌కే కెప్టెన్సీ దక్కడం ఖాయం. పంజాబ్ కింగ్స్‌కి మయాంక్ అగర్వాల్ బెస్ట్ కెప్టెన్సీ ఆప్షన్...
910
వేలంలో కొత్త కెప్టెన్ కోసం వెతికే కంటే ఉన్నవారిలో సమర్థులైన వారికి కెప్టెన్సీ అప్పగించడమే చాలా బెటర్. కేకేఆర్‌కి అలాంటి అవకాశం లేదు...
1010
ఎందుకంటే ఇప్పుడు ఆ జట్టులో సమర్థుడైన కెప్టెన్ లేడు. కచ్చితంగా కొత్త కెప్టెన్ వేటలో ఉండాల్సిన పరిస్థితి...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఆర్‌సీబీ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ గ్లెన్ మ్యాక్స్‌వెల్...