ఇషాన్ కిషన్ అరుదైన ఫీట్... గంగూలీ రికార్డు బ్రేక్ చేసిన శిఖర్ ధావన్...

Published : Jul 18, 2021, 09:07 PM IST

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు దూకుడు చూపిస్తోంది. యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా మాస్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఆ తర్వాత ఆరంగ్రేట ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

PREV
19
ఇషాన్ కిషన్ అరుదైన ఫీట్... గంగూలీ రికార్డు బ్రేక్ చేసిన శిఖర్ ధావన్...

బౌండరీతో ఇన్నింగ్స్ ఆరంభించిన పృథ్వీషా.. 24 బంతుల్లో 9 ఫోర్లతో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పృథ్వీషా మెరుపుల కారణంగా 5.2 ఓవర్లలో 58 పరుగులు చేసింది టీమిండియా...

29

మొట్టమొదటి వన్డే మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్, సిక్సర్‌తో తన కెరీర్‌ను ఆరంభించాడు. సిక్సర్‌తో వన్డే కెరీర్‌ను ఆరంభించిన భారత బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్...

39

టీ20లో ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్, వన్డేల్లోనూ తొలి మ్యాచ్‌లో అర్ధశతకం చేశాడు. ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్ ఇషాన్ కిషన్ కాగా, ఇంతకుముందు రాబిన్ ఊతప్ప తన తొలి టీ20, తొలి వన్డే ఇన్నింగ్స్‌లలో (రెండో వన్డే) హాఫ్ సెంచరీ చేశాడు. 

49

బర్త్ డే రోజున వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన ఐదో భారత ప్లేయర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. ఇంతకుముందు వినోద్ కాంబ్లే తన 21వ పుట్టినరోజున, నవ్‌జోత్ సిద్దూ 31వ పుట్టినరోజున, సచిన్ టెండూల్కర్ 25వ పుట్టినరోజున, యూసఫ్ పఠాన్ తన 26వ బర్త్ డేన హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు.

59

ఈ లిస్టులో బర్త్ డే రోజున మొట్టమొదటి మ్యాచ్ ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తొలి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్..

69

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న శిఖర్ ధావన్, వన్డేల్లో 6వేల మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్.

79

ఓవరాల్‌గా హషీమ్ ఆమ్లా 123 ఇన్నింగ్స్‌ల్లో 6 వేల వన్డే పరుగులు పూర్తిచేసుకోగా, విరాట్ కోహ్లీ 136, కేన్ విలియంసన్ 139, శిఖర్ ధావన్ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు. 147 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకున్న గంగూలీని అధిగమించాడు గబ్బర్...

89

అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిసి 10 వేల పరుగులను పూర్తిచేసుకున్నాడు శిఖర్ ధావన్. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు ధావన్. 

99

లంక టూర్‌కు కోచ్‌గా వ్యవహారిస్తున్న రాహుల్ ద్రావిడ్, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఐదో భారత బ్యాట్స్‌మెన్ కావడం విశేషం.

click me!

Recommended Stories