ఈ క్రమంలో ఆర్సీబీ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీని టీమ్ మెంబర్స్ రంగుల్లో ముంచెత్తారు. సప్తవర్ణాలు ఆమె శరీరంపై భాగమయ్యాయా అన్నంతగా రంగులు చల్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆర్సీబీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎలీస్ పెర్రీ, హీథర్ నైట్, సోఫీ డెవిన్, రేణుకా సింగ్ ఠాకూర్ ల ఫోటోలు నెట్టింట హల్చల్ సృష్టిస్తున్నాయి.