Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ముంబై జట్టును అన్‌ఫాలో చేయడంతో పాటు పాత పోస్టులన్నీ తొలగించడంతో అతను జట్టును వీడనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు ఏం జరుగుతోంది?
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మధ్య టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. 2026 టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా భారత్‌కు ట్రోఫీని అందించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శన అతని కెరీర్‌పై ప్రభావం చూపింది.
తాజాగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత జట్టునున ఎంపిక చేసిన బీసీసీఐ.. సూర్యను జట్టు నుండి తప్పించడమే కాకుండా, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి కూడా తొలగించింది. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. టీమిండియాలో చోటు కోల్పోవడంతో సూర్య అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
25
ముంబై ఇండియన్స్‌తో గ్యాప్ పెరిగిందా?
సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సోమవారం సూర్య ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కొన్ని మార్పులు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపాయి. సూర్య తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ముంబై ఇండియన్స్ జట్టును అన్‌ఫాలో చేశాడు.
అంతేకాకుండా, గతంలో ముంబై జెర్సీతో ఉన్న ఫోటోలు, జట్టుకు సంబంధించిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉన్న ముంబై ఇండియన్స్ అనే పేరును కూడా తొలగించాడు. దీంతో సూర్యకు, ముంబై ఫ్రాంచైజీకి మధ్య ఏదో గొడవ జరిగిందని, అతను వచ్చే సీజన్ నాటికి జట్టును వీడనున్నాడని ప్రచారం జోరందుకుంది.
35
ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శన
సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2026లో 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కేవలం 20.77గా ఉంది. ముంబై జట్టు ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 గెలిచి, 10 ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి టోర్నీ నుండి అవుట్ అయింది.
హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో ఉన్న సమయంలో సూర్య మూడు మ్యాచ్‌లకు కెప్టెన్సీ కూడా వహించాడు. అంతటి కీలక ఆటగాడు ఇప్పుడు జట్టుకు దూరం కావడం ముంబై అభిమానులకు షాకింగ్ అని చెప్పాలి.
ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌ను వీడితే, అతను తన పాత జట్టు అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ జట్టు ప్రస్తుతం ఒక మంచి భారతీయ బ్యాటర్, కెప్టెన్ కోసం వెతుకుతోంది. సూర్య గతంలో కేకేఆర్ తరఫున 60 మ్యాచ్‌లు ఆడి 684 పరుగులు చేశాడు.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా సూర్య వంటి అనుభవం ఉన్న ఆటగాడిని తీసుకోవడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. 2026 వేలంలో ముంబై అతన్ని రూ. 16.25 కోట్లకు రిటైన్ చేసుకుంది, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జట్టు మార్పు ఖాయమనిపిస్తోంది.
Suryakumar Yadav removed Mumbai Indians and Mumbai from his bio. He unfollowed Mumbai Indians. MI unfollowed him. He deleted all MI related pics and videos from his insta id. He changed his pfp too.
గతంలో ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో హార్దిక్ పాండ్యా కూడా ఇలాగే ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేసి, మళ్ళీ రెండు గంటల తర్వాత ఫాలో అయ్యాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం పోస్టులను కూడా డిలీట్ చేయడంతో ఇది కేవలం పొరపాటు కాదని నెటిజన్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం సూర్య ముంబై టీ20 లీగ్‌లో ట్రయంఫ్ నైట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అక్కడ కూడా అతని జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయి చివరి స్థానంలో ఉంది. మొత్తానికి సూర్యకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది.