షారుఖ్ ఖాన్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అందరికీ షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. !

Published : Jul 20, 2024, 12:34 PM IST

Virat Kohli Tops Celebrity Brand Valuation : టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ మొత్తం బ్రాండ్ విలువ దాదాపు 29 శాతం పెరిగింది. 2022లో $176.9 మిలియన్ల నుండి $227.9 మిలియన్లకు చేరుకుంది. భార‌త్ లో అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లీ నిలిచాడు.   

PREV
17
షారుఖ్ ఖాన్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అందరికీ షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. !
Virat Kohli, Shah Rukh Khan, Ranveer Singh

Virat Kohli : భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి బాలీవుడ్‌ సూపర్‌స్టార్లకు షాకిచ్చాడు. టాప్ స్టార్స్ షారుఖ్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌లను అధిగమించి భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా కింగ్ కోహ్లీ నిలిచాడు.

27

క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం.. విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ 29% పెరిగి $227.9 మిలియన్లకు చేరుకుంది. ఈ గణనీయమైన పెరుగుదల భారత్‌లోని అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో కోహ్లీని టాప్ లోకి చేర్చింది. 

37

మొత్తగా ఈ సంవత్సరానికి సంబంధించిన వివరాలు గమనిస్తే.. టాప్ 20 సెలబ్రిటీలు పొందిన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల సంఖ్యలో 14.2% పెరుగుదల కనిపించింది. ఈ ట్రెండ్ ప్రకటనల ప్రయోజనాల కోసం టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై విస్తరిస్తున్న ప్రాధాన్యతను నొక్కిచెప్పాయి. 

47

విరాట్ కోహ్లి ఎండార్స్‌మెంట్ ల్యాండ్‌స్కేప్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. అతని బ్రాండ్ విలువ $227.9 మిలియన్లుగా ఉంది.

57

'బ్రాండ్స్, బిజినెస్, బాలీవుడ్' పేరుతో క్రోల్ తాజా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్  రిపోర్టు ప్ర‌కారం.. కోహ్లీ తర్వాత బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, $203.1 మిలియన్ బ్రాండ్ విలువతో రెండో ప్లేస్ లో ఉన్నాడు. 

67

షారూఖ్ ఖాన్ బ్రాండ్ విలువ కూడా బాగా పెరిగింది. $120.7 మిలియన్ల బ్రాండ్ విలువతో మూడవ స్థానానికి చేరుకున్నాడు. 

 

77
Virat Kohli

పరిశ్రమలో స్థిరమైన పట్టును ప్రతిబింబిస్తూ అక్షయ్ కుమార్ బ్రాండ్ విలువ $111.7 మిలియన్ల అంచనాతో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు.అలాగే, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ $101.1 మిలియన్ల బ్రాండ్ విలువతో ఐదో స్థానంలో ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories