Published : Jul 20, 2024, 07:29 PM ISTUpdated : Jul 20, 2024, 08:38 PM IST
Team India : శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 జట్టు ఆడనుంది. వన్డే జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు.
Team India : శ్రీలంక పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో మరోసారి చాలా మంది వెటరన్ ఆటగాళ్లకు చోటుదక్కలేదు. మొన్నటి వరకు జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లు ఇప్పుడు ఔట్ అయ్యారు. దాదాపు వీరి వన్డే కెరీర్ ముగిసిందనే సంకేతాలు అందుతున్నాయి. భారత వన్డే జట్టులో అవకాశం దొరకడం కష్టంగా ఉన్న స్టార్ లలోని టాప్-5 ప్లేయర్లను గమనిస్తే..
26
రవిచంద్రన్ అశ్విన్
భారత బౌలర్లలో అశ్విన్ అత్యంత అనుభవజ్ఞుడు. టీమిండియా తరఫున 116 వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయలేదు. గతేడాది ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడాడు. 37 ఏళ్ల అశ్విన్ మళ్లీ వన్డే జట్టులోకి రావడం కష్టమే.
36
రవీంద్ర జడేజా
భారత దిగ్గజ ఆల్‌రౌండర్లలో ఒకరైన రవీంద్ర జడేజా కూడా శ్రీలంక పర్యటనకు ఎంపిక కాలేదు. భారత్ తరఫున 197 మ్యాచ్‌లు ఆడాడు. 220 వికెట్లు తీశాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జడేజా ఆడాడు. 35 ఏళ్ల ఈ ఆటగాడిని ఇప్పుడు వన్డే జట్టు నుంచి తప్పించారు. జడేజా స్థానంలో మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ప్రాధాన్యం లభించింది.
46
భువనేశ్వర్ కుమార్
ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు మరోసారి నిరాశే మిగిలింది. భువనేశ్వర్ 2022 నుంచి టీమ్ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. చివరగా జనవరి 2022లో దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్ ను ఆడాడు. 121 వన్డేల్లో భువనేశ్వర్ కుమార్ 141 వికెట్లు తీసుకున్నాడు. జట్టులోకి వస్తున్న కొత్త ఫాస్ట్ బౌలర్లను గమనిస్తే ఇప్పట్లో భువనేశ్వర్ జట్టులోకి రావడం కష్టమే.
56
కృనాల్ పాండ్యా
ఒకవైపు టీ20 ప్రపంచకప్‌తో హార్దిక్ పాండ్యా స్టార్ గా మరో ఎత్తు పైకెళ్తే.. మరోవైపు అతని సోదరుడు కృనాల్ పాండ్యా అదృష్టం మాత్రం వెలగడం లేదు. కృనాల్ చాలా కాలంగా వన్డే జట్టులోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాడు. కృనాల్‌కు కేవలం 5 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అతను 2021లో అరంగేట్రం చేసాడు. అదే సంవత్సరంలో తన చివరి మ్యాచ్ ఆడాడు. 33 ఏళ్ల కృనాల్ పాండ్యా కూడా వన్డే జట్టులోకి రావడం దాదాపు కష్టమనే చెప్పాలి.
66
మయాంక్ అగర్వాల్
స్టైలిష్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా వన్డే జట్టునుంచి ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మయాంక్ కొట్టే షాట్‌లను క్రికెట్ లవర్స్ ఎంతగానో ఇష్టపడతారు, కానీ వరుసగా పేలవమైన ఫామ్ కారణంగా అతను జట్టు నుంచి ఔట్ అయ్యాడు. ఇప్పటివరకు 5 వన్డేలను ఆడాడు. 2020లో అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్ చివరకు అదే ఏడాదితో భారత వన్డే జట్టుకు ఆడాడు.