IPL2022 Mega Auction: రూ.515.5 కోట్లు, 289 ప్లేయర్లు,10 ఫ్రాంఛైజీలు...

Published : Feb 11, 2022, 06:43 PM IST

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్వహిస్తున్న అత్యంత కాస్ట్‌లీ క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఏటికేటికీ క్రేజ్ పెంచుకుంటూ, కోట్లకు కోట్లు ఆర్జిస్తూ వెళ్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది...

PREV
111
IPL2022 Mega Auction: రూ.515.5 కోట్లు, 289 ప్లేయర్లు,10 ఫ్రాంఛైజీలు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్ జట్ల ఎంట్రీతో మొత్తంగా 10 ఫ్రాంఛైజీలు, టైటిల్ కోసం పోటీపడబోతుండడంతో మెగా క్రికెట్ లీగ్‌ సుదీర్ఘంగా సాగనుంది...

211

60 రోజులకు బదులుగా దాదాపు 74 రోజుల పాటు సాగే ఐపీఎల్ పండగ... మెగా వేలం నుంచే మొదలైపోతుంది. భారత జట్టు మ్యాచులను చూడని అభిమానులు కూడా ఐపీఎల్‌ను ఆసక్తికరంగా వీక్షిస్తారు...

311

ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తంగా 10 ఫ్రాంఛైజీలు కలిపి రూ.515.5 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం కాబోతున్నాయి. మెగా వేలంలో 590 మంది పాల్గొంటున్నప్పటికీ, అమ్ముడుపోయే ప్లేయర్ల సంఖ్య 289 మందే...

411

ప్రతీ జట్టూ 25 మంది ప్లేయర్లను (అందులో అత్యధికంగా 8 మంది విదేశీ ప్లేయర్లు) కొనుగోలు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకున్న ప్లేయర్లను తీసివేయగా మిగిలిన వారిని వేలంలో కొనుగోలు చేసుకోవచ్చు...

511

ఉదాహరణకు పంజాబ్ కింగ్స్ జట్టు మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది. దీంతో ఆ జట్టు మెగా వేలంలో 23 మంది ప్లేయర్లను, అందులో 8 మంది విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది...

611

మిగిలిన జట్లతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ పర్సులో అత్యధికంగా రూ.72 కోట్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టి ఖాళీగా ఉన్న 23 స్లాట్స్‌ను పూర్తి చేసుకోవచ్చు...

711

ఐపీఎల్ మెగా వేలం 2022 కోసం ఖర్చు పెట్టే రూ.515.5 కోట్లను అమ్ముడుపోయే 289 మందికి సమానంగా పంపినా కూడా ఒక్కో ప్లేయర్‌కి రూ.1.78 కోట్లు దక్కుతాయి...

811

పాక్ సూపర్ లీగ్‌లో అత్యధికంగా చెల్లించే మొత్తానికి ఇది సమానం. ఐపీఎల్‌లో కేవలం రిటైన్ చేసుకున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కే రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పీఎస్‌ఎల్‌లో అత్యధిక మొత్తం అందుకునే ప్లేయర్ రూ.3 కోట్ల వరకూ తీసుకుంటాడు...

911

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీల పర్సులో సరిగ్గా రూ.48 కోట్లు ఉండడం విశేషం...

1011

ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగుసార్లు టైటిల్ గెలిచిన సీఎస్‌కే, టూ టైం ఛాంపియన్ కేకేఆర్ కూడా నాలుగేసి ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. 

1111

ఐపీఎల్ 2022 సీజన్ కోసం కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ , మెగా వేలంలో ఏ స్ట్రాటెజీ ఫాలో అవుతుందా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది..

click me!

Recommended Stories