ప్రసిద్ధ్ కృష్ణను జోఫ్రా ఆర్చర్‌తో పోల్చిన అభిమానులు... వాడితో పోలికేంటి అన్న నెటిజన్‌కి...

Published : Feb 11, 2022, 06:01 PM IST

ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లలో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒకడు. 140 కి.మీ.ల వేగంతో బంతులు వేసే ప్రసిద్ధ్ కృష్ణ, అంతర్జాతీయ ఆరంగ్రేటం నుంచి అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో రికార్డు బ్రేకింగ్ స్పెల్ వేశాడు...

PREV
18
ప్రసిద్ధ్ కృష్ణను జోఫ్రా ఆర్చర్‌తో పోల్చిన అభిమానులు... వాడితో పోలికేంటి అన్న నెటిజన్‌కి...

తొలి వన్డేలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, రెండో వన్డేలో 9 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు... 

28

జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లు లేని లోటు తెలీకుండా పేస్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ని కకావికలం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు.

38

రెండో వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ సంచలన బౌలింగ్ స్పెల్ తర్వాత సోషల్ మీడియాలో అతని గురించి చర్చ జరిగింది. కొందరు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌ను ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌తో పోల్చారు...

48

ప్రసిద్ధ్ కృష్ణ ఇండియన్ జోఫ్రా ఆర్చర్ అంటూ ఓ క్రికెట్ అభిమాని ట్వీట్ చేసింది. దానికి ఓ నెటిజన్... ‘దయచేసి ఎంతో కష్టపడే, నిజాయితీ కలిగిన ప్రసిద్ధ్ కృష్ణను మోసగాడు, ఫిట్‌నెస్ లేనోడు, రేస్ కార్డ్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్‌తో పోల్చకండి...’ అంటూ కామెంట్ చేశాడు...

58

ఈ కామెంట్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ట్యాగ్ చేయకపోయినా ఎలాగో గమనించిన ఇంగ్లాండ్ బౌలర్, దీనిపై స్పందించాడు. ‘త్వరలో నీకు నయం అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్చర్...

68

గాయం కారణంగా ఐపీఎల్ 2021, టీ20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ ఆడలేకపోయిన జోఫ్రా ఆర్చర్... ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం రిజిస్టర్ చేయించుకున్నాడు...

78

గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనప్పటికీ 2023 ఐపీఎల్ సీజన్‌కి అందుబాటులో ఉండేందుకే వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడట జోఫ్రా ఆర్చర్...

88

ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఐపీఎల్ 2022 మెగా వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మెగా వేలానికి ముందు విండిస్ సిరీస్‌లో ప్రసిద్ధ్ ఇచ్చిన పర్ఫామెన్స్ అతనికి భారీ ధరను తెచ్చి పెట్టే అవకాశం ఉంది... 

click me!

Recommended Stories