IPL2021 PBKS vs RCB: పంజాబ్ కింగ్స్ చిత్తు... ప్లేఆఫ్స్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

First Published Oct 3, 2021, 7:22 PM IST

పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది... అద్భుత ఆరంభం దక్కినా, ఈజీ విక్టరీ సాధించాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఎలా ఓడాలో మరోసారి చూపిస్తూ... 165 పరుగుల లక్ష్యచేధనలో దగ్గరిదాకా వచ్చి, విజయానికి కావాల్సిన మార్జిన్‌ని దాటలేకపోయింది పంజాబ్...

165 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్ కింగ్స్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 11 ఓవర్లలోనే 91 పరుగులు జోడించారు...

10.4 ఓవర్లలో 91 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్, ఈజీగా విజయాన్ని అందుకుంటుందని అనిపించింది. అయితే ఆర్‌సీబీ ప్లేయర్లు కీలక సమయంలో అద్భుతంగా రాణించి, మ్యాచ్‌ను మలుపు తిప్పారు...

35 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, షాబజ్ అహ్మద్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత నికోలస్ పూరన్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి మరోసారి నిరాశపరచగా మయాంక్ అగర్వాల్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేసిన ఓవర్‌లోనే సర్ఫరాజ్ ఖాన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు యజ్వేంద్ర చాహాల్... 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన మర్క్‌రమ్, జార్జ్ గార్టన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

35 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పంజాబ్ కింగ్స్... 
విజయానికి 2 ఓవర్లలో 27 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్... కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు...

ఆఖరి 6 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో లేని పరుగు కోసం ప్రయత్నించిన షారుక్ ఖాన్ రనౌట్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేశాడు షారుక్...

ఆ తర్వాత ఐదో బంతికి హెండ్రిక్స్ సిక్సర్ బాదినా, అప్పటికే ఆలస్యం కావడంతో ఆఖరి బంతికి 8 పరుగులు కావాల్సి వచ్చింది. హర్షల్ పటేల్ ఒకే పరుగు ఇవ్వడంతో 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది ఆర్‌సీబీ...

click me!