గ్లెన్ మ్యాక్స్‌వెల్ దృష్టిలో టాప్ 5 టీ20 ప్లేయర్లు వీరే ... విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్‌లకి దక్కని చోటు...

Published : Oct 03, 2021, 06:50 PM ISTUpdated : Oct 03, 2021, 06:51 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రూ.10.25 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. 13 మ్యాచులు ఆడి ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయిన మ్యాక్స్‌వెల్ కోసం అంత పెట్టడానికి సిద్ధమైన బెంగళూరుని చూసి అందరూ నవ్వుకున్నారు...

PREV
110
గ్లెన్ మ్యాక్స్‌వెల్ దృష్టిలో టాప్ 5 టీ20 ప్లేయర్లు వీరే ... విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్‌లకి దక్కని చోటు...

పంజాబ్ కింగ్స్ తరుపున 2020 సీజన్‌లో ఘోరంగా ఫ్లాప్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 2021 సీజన్‌లో మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నాడు...

210

ఐపీఎల్ 2021 సీజన్‌లో 12 మ్యాచుల్లో 5 హాఫ్ సెంచరీలతో 407 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆర్‌సీబీ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్నాడు... బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు...

310

తాజాగా టీ20ల్లో 7 వేల పరుగులను అందుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, టాప్ 5 టీ20 ప్లేయర్లను ఎంపిక చేశాడు... అయితే మ్యాక్స్‌వెల్, టాప్ 5 టీ20 ప్లేయర్ల లిస్టులో కోహ్లీతో పాటు ధోనీ, రోహిత్ శర్మల వంటి ఒక్క భారత ప్లేయర్‌కి కూడా చోటు దక్కకపోవడం విశేషం...

410

రషీద్ ఖాన్: ఆఫ్ఘనిస్తాన్ యంగ్ సంచలనం రషీద్ ఖాన్‌ను టీ20ల్లో టాప్ 1 ప్లేయర్‌గా ఎంపిక చేశాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. బౌలింగ్‌లో రషీద్ చూపిస్తున్న వేరియేషన్స్, అతన్ని టాప్‌లో నిలబెట్టాయని అన్నాడు...

510

ఇప్పటికే 281 టీ20 మ్యాచులు ఆడిన రషీద్ ఖాన్, 388 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో మంచి పర్ఫామెన్స్ చూపించి 1288 పరుగులు చేశాడు...

610

ఆండ్రే రస్సెల్: టీ20ల్లో లెజెండరీ ప్లేయర్‌గా మారిన విండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్‌ను టాప్ 2 టీ20 ప్లేయర్‌గా ఎంచుకున్నాడు మ్యాక్స్‌వెల్...

710

తన టీ20 కెరీర్‌తో 382 మ్యాచులు ఆడిన ఆండ్రే రస్సెల్, దాదాపు 170 స్ట్రైయిక్ రేటుతో 6405 పరుగులతో పాటు బౌలింగ్‌లో 340 వికెట్లు కూడా పడగొట్టాడు...

810

బెన్ స్టోక్స్: 148 టీ20 మ్యాచుల్లో దాదాపు 140 స్ట్రైయిక్ రేటుతో 2865 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్, బౌలింగ్‌లో 86 వికెట్లు కూడా తీశాడు... బెన్ స్టోక్స్‌ని టాప్ 3 టీ20 ప్లేయర్‌గా ఎంచుకున్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్..

910

ఆడమ్ గిల్‌క్రిస్ట్ : ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, తన కెరీర్‌లో 102 టీ20 మ్యాచుల్లో 140కి పైగా స్ట్రైయిక్ రేటుతో 2622 పరుగులు చేశాడు... గేమ్ ఛేంజర్‌ గిల్‌క్రిస్ట్‌ని టాప్ 4 టీ20 ప్లేయర్‌గా ఎంచుకున్నాడు మ్యాక్స్‌వెల్...

1010

షాన్ టైట్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షాన్ టైట్‌కి గ్లెన్ మ్యాక్స్‌వెల్ లిస్టులో టాప్ 5 టీ20 ప్లేయర్‌గా చోటు దక్కింది.. షాన్ టైట్ 150 కి.మీ. వేగంతో బంతులు విసురుతూ, 171 టీ20 మ్యాచుల్లో 218 వికెట్లు పడగొట్టాడు...

click me!

Recommended Stories