ఐపీఎల్ 2021 సీజన్ ఆపే ఉద్దేశం లేదు, ఎవ్వరైనా మధ్యలో వెళ్లిపోతే... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

First Published Apr 26, 2021, 8:05 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపివేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది బీసీసీఐ. ఓ వైపు దేశంలో కరోనా విలయ బీభత్సం చేస్తున్నా, మరోవైపు ఫారిన్ క్రికెటర్లు భయంతో స్వదేశానికి వెళ్తున్నా ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని తెలిపింది భారత క్రికెట్ బోర్డు.

భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు దాదాపు అరడజను మంది విదేశీ ప్లేయర్లు, కరోనా భయంతో సీజన్ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఐపీఎల్ 2021 సీజన్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
undefined
కరోనా కష్టకాలంలో కుటుంబంతో అండగా ఉండాలని భావించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అశ్విన్, సీజన్ మధ్యలో బ్రేక్ తీసుకోగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు లివింగ్ స్టోన్, ఆండ్రూ టై, ఆర్‌సీబీ ప్లేయర్లు కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా స్వదేశానికి పయనమయ్యారు.
undefined
‘ఇప్పటికైతే, ఐపీఎల్‌ను మధ్యలో ఆపే ఉద్దేశం లేదు. ఎవ్వరైనా సీజన్ మధ్యలోనే వెళ్లిపోవాలని అనుకుంటే, వారిని ఆపాలని అనుకోవడం లేదు. అది వారి ఇష్టం...
undefined
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా, కట్టుదిట్టమైన భద్రతా వలయం నిర్మించి మ్యాచులను నిర్వహిస్తున్నాం. ప్లేయర్లు పూర్తిగా బయో బబుల్‌లో గడుపుతున్నారు. ఎలాంటి భయం అవసరం లేదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టుకి మెంటర్‌గా వ్యవహారిస్తున్న డేవిడ్ హుస్సే, ఐపీఎల్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు కాస్త ఒత్తిడికి గురవుతున్నారని, కరోనా భయంతో స్వదేశానికి వెళ్లాలని ఆలోచిస్తున్నారని తెలిపాడు..
undefined
‘ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ కాస్త ఒత్తిడిలో ఉన్నారు. అయితే అందులో కొంత మంది మాత్రమే ధైర్యం చేసి, ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయం తీసుకుంటున్నారు...’ అంటూ చెప్పాడు ఆసీస్ మాజీ ప్లేయర్ హుస్సీ..
undefined
ఐపీఎల్ ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్లతో , ఆసీస్ మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు, కోచ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నామని, వారి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపింది ఆసీస్ క్రికెట్ బోర్డు...
undefined
‘మేం ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను మానిటర్ చేస్తున్నాం. ఐపీఎల్ మ్యాచులు నిర్వహిస్తున్న తీరుపై ఇంగ్లాండ్ క్రికెటర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఇండియాకి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది’ అంటూ కామెంట్ చేసింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.
undefined
న్యూజిలాండ్ నుంచి పెద్దగా ప్లేయర్లు ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఆడడం లేదు. కేన్ విలియంసన్, ట్రెంట్ బౌల్ట్‌లతో పాటు మిగిలిన కివీస్ ప్లేయర్లు, ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచులకు ముందే స్వదేశానికి పయం కానున్నారు. జూన్ 2 నుంచి ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొనడానికి 15 రోజుల ముందే స్వదేశానికి వెళ్తారు న్యూజిలాండ్ ప్లేయర్లు.
undefined
click me!