ఇదెక్కడి పనికిమాలిన వాదన.. ఇది అసంబద్ధం..! బీసీసీఐ తీరుతో విసిగిపోతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు

First Published Aug 14, 2022, 5:14 PM IST

BCCI: బీసీసీఐ తీరుపై ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు గుర్రుగా ఉన్నారా..?  ప్రపంచ క్రికెట్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీసీసీఐ.. తమ దేశపు ఆటగాళ్లపై అనుసరిస్తున్న వైఖరిపై యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  

Rohit Sharma

బీసీసీఐ తీరుపై ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు గుర్రుగా ఉన్నారా..?  అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  విదేశీ లీగ్ లలో భారత క్రికెటర్లను అనుమతించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భారత జాతీయ  జట్టుకు గానీ, దేశవాళీలో గానీ ఆడే ఏ ఒక్క భారత క్రికెటర్ అయినా విదేశీ లీగ్ లలో ఆడటానికి వీళ్లేదు. 

 ఒకవేళ ఆడాల్సి వస్తే ఇక బీసీసీఐతో శాశ్వతంగా సం‘బంధాలు’ తెంచుకోని  వెళ్లాలి.  ఇప్పటివరకు ఈ జాబితాలో రిటైరైన ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్ వంటి వాళ్లు ఉండగా యువ క్రికెటర్లలో ఉన్ముక్త్ చంద్ ఒక్కడే బీసీసీఐతో బంధం కాదనుకుని ఫారెన్ లీగ్ లలో ఆడుతున్నాడు.

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్గుగా వ్యవహరిస్తున్న బీసీసీఐ తీరుపై ఐపీఎల్ ఓనర్లు కోపంగా ఉన్నారట. భారత్ తో పాటు వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), దక్షిణాఫ్రికా లో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభంకాబోతున్న క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్, యూఏఈలో మొదలుకానున్న ఇంటర్నేషనల్ టీ20 (ఐఎల్‌టీ20)లలో ఇక్కడి ఓనర్లు పెట్టుబడులు పెట్టారు. 
 

దీంతో వాళ్లు ఇక్కడ క్రేజ్ ఉన్న ఆటగాళ్లను తీసుకెళ్లి పారెన్ లీగ్ లలో ఆడించాలని భావిస్తున్నారు. కానీ బీసీసీఐ మాత్రం వారి ఆశలపై నీళ్లు జల్లుతున్నది. ఇండియా, దేశవాళీలో ఆడే క్రికెటర్లు ఫారెన్ లీగ్ లలో ఆడకూడదని నిబంధనను తూచా తప్పకుండా అమలు చేస్తామని కరాఖండీగా చెబుతున్నది. 

‘ప్లేయర్లను ఇవ్వకుటే  పాయే.. కనీసం సహాయక సిబ్బందినైనా అనుమతించండి మహాప్రభో.. ’ అని మొరపెట్టుకున్నా దానికీ బీసీసీఐ వెనక్కి తగ్గడం లేదు.  కుందేలు, మూడు కాళ్లు అన్న సూత్రాన్ని పాటిస్తూ.. తమ బంధం తెంచుకుని వెళ్తే తమకేమీ అభ్యంతరం లేదని మెలికపెడుతున్నది. ఇది ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లకు కోపం తెప్పిస్తున్నది. 

ms dhoni

సౌతాఫ్రికాలో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్ర సింగ్ ధోనిని మెంటార్ గా నియమించుకుంటామన్నా బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. మళ్లీ ఐపీఎల్ లో భాగం కానంటే తప్ప ధోనిని  అనుమతించడం కుదరదని చెప్పింది. ధోనితో పాటు లక్ష్మీపతి బాలాజీకీ కూడా ఇదే పరిస్థితి. 

Image credit: Mumbai Indians

ఇదొక్క చెన్నైకే కాదు.. సౌతాఫ్రికాలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్నాయి. వీళ్లు కూడా బీసీసీఐతో ఇవే తంటాలు పడుతున్నారు. దీంతో ఐపీఎల్ ఓనర్లంతా బీసీసీఐపై కోపంతో రగిలిపోతున్నారని టాక్ వినపడుతోంది. 

ఇదే విషయమై ఓ ఫ్రాంచైజీ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘చూడండి. ఈ విషయం గురించి ఇప్పటివరకు మేం బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వినలేదు. మేం వింటున్నవన్నీ మీడియా రిపోర్టుల ద్వారా వచ్చిన కథనాలే. ఒకవేళ అవే నిజమైతే మాత్రం ఇది నిజంగా తర్కం లేని వాదన. అసంబద్ధం.  ప్లేయర్లను పంపించకున్నా పర్లేదు. కానీ సహాయక సిబ్బంది పై కూడా ఇవే ఆంక్షలు పెడితే ఎలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

click me!