సచిన్ టెండూల్కర్, గంగూలీ, కోహ్లీలకు కలిసిరాని ఆసియా కప్... టైటిల్ గెలిచిన భారత కెప్టెన్లు వీరే...

Published : Aug 14, 2022, 04:40 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా 14వ సీజన్ ఆరంభం కానుంది. గత సీజన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన భారత జట్టు, మరోసారి అతని కెప్టెన్సీలో టైటిల్ ఫెవరెట్‌గా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్ 2022 టోర్నీ ఆడనుంది...

PREV
110
సచిన్ టెండూల్కర్, గంగూలీ, కోహ్లీలకు కలిసిరాని ఆసియా కప్... టైటిల్ గెలిచిన భారత కెప్టెన్లు వీరే...

ఆసియా కప్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన భారత జట్టు ఇప్పటిదాకా 7 సార్లు టైటిల్ గెలిచింది. ఆసియా కప్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్ సునీల్ గవాస్కర్...

210

యూఏఈలో జరిగిన 1984 ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి మొట్టమొదటి టైటిల్ కైవసం చేసుకుంది భారత జట్టు. మొట్టమొదటి ఆసియా కప్‌లో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ మాత్రమే ఆడాడు. రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా... ఆసియా కప్ గెలిస్తే... శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయం సాధించి రన్నరప్‌గా నిలిచింది. రెండు మ్యాచుల్లోనూ ఓడిన పాకిస్తాన్ ఆఖరి స్థానంలో నిలిచింది...

310

1986 ఆసియా కప్ టోర్నీలోనూ మూడు జట్లే పాల్గొన్నాయి. అయితే భారత జట్టు ఈ టోర్నీలో ఆడలేదు. టీమిండియాకి బదులుగా బంగ్లాదేశ్ పాల్గొంది. ఆ తర్వాత 1988లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టైటిల్‌ను భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది. దిలీప్ వెంగ్‌సర్కార్ కెప్టెన్సీలో రెండోసారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది భారత జట్టు...
 

410

1990-91 సీజన్‌లోనూ మూడు జట్లే ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్నాయి. ఈసారి పాకిస్తాన్, ఆసియా కప్‌కి దూరంగా ఉంది. గ్రూప్ స్టేజీలో భారత జట్టును ఓడించిన శ్రీలంకను ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి అద్భుత విజయం అందుకుంది టీమిండియా. ఈ ఫైనల్ మ్యాచ్‌లో కపిల్ దేవ్ హ్యాట్రిక్ తీయగా మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు...

510

1995లోనూ శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా హ్యాట్రిక్ కొట్టింది టీమిండియా. ఈ మ్యాచ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన మహ్మద్ అజారుద్దీన్, వరుసగా రెండు సార్లు ఆసియా కప్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. 1997లో ఆసియా కప్ ఫైనల్‌లో లంక చేతుల్లో ఓడింది భారత జట్టు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ఫైనల్ చేరినా, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది భారత జట్టు...

610
Sourav Ganguly

2000వ సంవత్సరంలో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో ఫైనల్ కూడా చేరలేకపోయింది టీమిండియా. ఈ టోర్నీలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో బరిలో దిగింది భారత జట్టు. 2004 ఆసియా కప్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించాడు గంగూలీ. ఈ ఎడిషన్‌లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయింది గంగూలీ టీమ్...

710
Image credit: Getty

008లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో శ్రీలంక చేతుల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు, 2010లో లంకను ఓడించి మాహీ కెప్టెన్సీలోనే టైటిల్ గెలిచింది. 2012లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆసియా కప్ ఆడిన భారత జట్టు, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. 

810
Virat Kohli

2014లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో (ధోనీ రెస్ట్ తీసుకోవడంతో) ఆసియా కప్ ఆడిన టీమిండియా, మూడో స్థానానికి పరిమితమై ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. విరాట్ కెప్టెన్సీలో ఆడిన ఆసియా కప్ టోర్నీ ఇదొక్కటే... 

910
ms dhoni

2016లో మళ్లీ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోనే ఆసియా కప్ ఆడి ఆరో టైటిల్ గెలిచింది భారత జట్టు. ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది ధోనీ టీమ్. 2018లో విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ ఆడి... ఏడో సారి టైటిల్ గెలిచింది భారత జట్టు...

1010

మొత్తంగా సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, రోహిత్ శర్మ ఒక్కోసారి ఆసియా కప్ టైటిల్స్ గెలిస్తే... మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీల్లో రెండేసి సార్లు టైటిల్స్ గెలిచింది టీమిండియా.. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కెప్టెన్లుగా ఆసియా కప్ గెలవలేకపోయారు. 

Read more Photos on
click me!

Recommended Stories