IPL Auction 2020: ఈ ఆల్ రౌండర్స్ పై కన్నేసిన ఫ్రాంచైజీలు

First Published Dec 19, 2019, 11:10 AM IST

కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆల్ రౌండర్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆల్ రౌండర్లు వేలంపాటలో హాట్ కేక్స్ లా అమ్ముడుపోతారు. ఐపిఎల్ 13వ ఎడిషన్ కోసం వేలంపాటలు గురువారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని ఆల్ రౌండర్ల జాబితా చూద్దాం.

ఐపిఎల్ 13వ ఎడిషన్ కోసం వేలంపాటలు గురువారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని ఆల్ రౌండర్ల జాబితా చూద్దాం
undefined
గ్లెన్ మాక్స్ వెల్ : మానసిక స్థితి కారణంగా కొంత కాలం విశ్రాంతి తీసుకున్న మాక్స్ వెల్ తిరిగి వస్తున్నాడు. అతను సాధించిన గణాంకాలు పెద్దగా లేకపోయినప్పటికీ అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. 69 మ్యాచుల్లో 22.90 సగటుతో అతను 1397 పరుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్స్ ద్వారా జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది. దానికితోడు అద్భుతమైన ఫీల్డర్ కూడా.
undefined
క్రిస్ మోరిస్: 2019లో సరిగా ఆడకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ క్రిస్ మోరిస్ ను రిలీజ్ చేసింది. అయితే, ఐపిఎల్ కు వచ్చేసరికి దక్షిణాఫ్రికాకు సంబంధించిన ఈ ఆల్ రౌండర్ ముఖ్యమైన ఆటగాడే. డెత్ బౌలింగ్ విషయంలో అతనికి అతనే సాటి. క్రమం తప్పకుండా వికెట్లు తీసుకోగలడు. అతను 36 టీ20ల్లో 44 వికెట్లు తీసుకున్నాడు.
undefined
జిమ్మీ నీషమ్ న్యూజిలాండ్ కు చెందిన జిమ్మీ నీషమ్ ఐపిఎల్ లోకి చాలా ఆలస్యంగా అడుగు పెట్టాడు. ఐపిఎల్ 7లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున, ఐపిఎల్ 8లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. అయితే, అతను పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ అతనికి గిరాకీ ఉంటుంది. ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకోవడంలో న్యూజిలాండ్ తరపున కీలకంగా వ్యవహరించాడు. అతని బేస్ ప్రైస్ 50 లక్షలు.
undefined
ఆండిలే ఫెహ్లుక్వాయో దక్షిణాఫ్రికాకు చెందిన ఇతను ఐపిఎల్ కు సంబంధించి ముఖ్యమైన ఆటగాడే. ఇప్పటి వరకు అతను ఐపిఎల్ ఆడలేదు. దేశివాళీ క్రికెటర్లకు అతని గురించి పెద్దగా తెలియదు. ఫ్రాచైంజీలను అతను అకర్షించే అవకాశం ఉంది. పరుగులు ఇవ్వడంలో అతను చాలా పిసినారి.
undefined
క్రిస్ వోక్స్... ఇంగ్లాండుకు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ విలువైన ఆల్ రౌండర్. ఇంగ్లాండు వన్డే ప్రపంచ కప్ సాధించడంలో కీలకమైన పాత్ర పోషించాడు. బంతితోనూ బ్యాట్ తోనూ సత్తా చాటగలడు. కొత్త బంతితోనూ, డెత్ ఓవర్సులోనూ అతను రాణించగలడు.
undefined
click me!