అశ్విన్ ఇప్పటివరకు 214 మ్యాచ్‌లు ఆడి 182 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 182 వికెట్ల రికార్డును కూడా అతను సమం చేశాడు. అశ్విన్ బౌలింగ్ సగటు 29.79 కాగా, 7.13 ఎకానమీతో బౌలింగ్ వేశాడు. 2010, 2011 లో సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలవడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. తమిళనాడుకు చెందిన ఈ స్పిన్నర్ 10 సంవత్సరాల తర్వాత మళ్లీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.9.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లోకి తిరిగి వచ్చాడు.