కెప్టెన్ గా రజత్ పాటిదార్ ఎందుకు?
గత ఏడాది మధ్యప్రదేశ్ జట్టును సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ విజయానికి నడిపించినప్పుడు రజత్ పటిదార్ నాయకత్వ లక్షణాల నేపథ్యంలో ఆర్‌సీబీ కెప్టెన్‌గా నియమితులయ్యారు. 10 మ్యాచ్‌లలో 61.14 సగటుతో 5 హాఫ్ సెంచరీలతో 428 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రజత్ పటిదార్‌ను కెప్టెన్ గా ఎంపిక చేసింది.
తన ఐపీఎల్ కెరీర్‌లో రజత్ పటిదార్ 27 మ్యాచ్‌లలో 34.74 సగటుతో ఒక శతకం, ఏడు హాఫ్ సెంచరీలతో 799 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో అతని ఉత్తమ సీజన్, 15 మ్యాచ్‌లలో 30.38 సగటుతో 395 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022 ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 బంతుల్లో 112 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పుడు రజత్ పాటిదార్ కు ఫేమ్‌ను అందుకున్నాడు.