ఈ మ్యాచ్ లో గుజరాత్ 41/2 పరుగులతో ఉన్న సమయంలో ఆష్లీ గార్డనర్ క్రీజులోకి వచ్చింది. ఆమె మొదట్లో స్థిరపడటానికి కొంత సమయం తీసుకుంది. మూనీ ఔట్ అయిన తర్వాత ఆష్లీ గార్డనర్ తన బ్యాటింగ్ విధ్వంసం చూపించింది. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది. గ్రౌండ్ అన్ని వైపుల సిక్సర్ల మోత మోగించింది.
ఆష్లీ గార్డనర్ అద్భుతమైన ఆటతీరుతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 201/5 పరుగులు చేసింది. ఇది టోర్నమెంట్‌లో వారి ఉమ్మడి అత్యధిక స్కోరు. 2023 ఎడిషన్ టోర్నమెంట్‌లో వారు RCBపై 201/7 పరుగులు చేశారు. ఆ మ్యాచ్‌లో, సోఫీ డంక్లీ, హర్లీన్ డియోల్ చెరో హాఫ్ సెంచరీ కొట్టారు.