IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముందే భారత యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకుంది. అయితే, అతనికి తక్కువ మొత్తాన్ని కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ టీమ్ ఎందుకు అలా చేసింది?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. మెల్ బోర్నలో లో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. 221/6తో ఇబ్బంది పడుతున్న భారత్ జట్టును 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన తెలుగు ప్లేయర్ 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా బౌలర్లను చితకబాది సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
తొలి టెస్ట్ సిరీస్‌లోనే సెంచరీతో నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ సర్కిల్ హాట్ టాపిక్ గా మారాడు. గత సీజన్ లో కొన్ని మంచి ఇన్నింగ్స్ లను ఆడిన నితీష్ రెడ్డి.. IPL 2025లో కీలక ఆటగాడిగా మారనున్నాడు. అయితే, IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే నితీష్ కుమార్ రెడ్డికి దక్షిణాఫ్రికా ఆటగాడి వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాడని మీకు తెలుసా?
25
సన్‌రైజర్స్ హైదరాబాద్
నితీష్ కుమార్ రెడ్డిని 6 కోట్లకు రిటైన్ చేసుకున్న హైదరాబాద్ టీమ్
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా గత IPL వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డిని 20 లక్షలకు టీమ్ లోకి తీసుకుంది. అయితే, IPL 2024లో అతను 13 మ్యాచ్‌లలో రెండు అర్ధ సెంచరీలతో సహా 303 పరుగులు చేశాడు. అలాగే, 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. దీంతో గత నవంబర్‌లో జరిగిన IPL వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఈ వేలానికి ముందు, నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. భారత జట్టులో అతని స్థానం, T20లలో అతని ఆల్‌రౌండర్ ప్రదర్శనల కారణంగా వేలంలో అతనికి 10 కోట్లకు పైగా ధర పలుకుతుందని అందరూ భావించారు. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
35
నితీష్ కుమార్ రెడ్డి IPL
ఎందుకు నితీష్ కుమార్ కు SRH ఎక్కువ కేటాయించలేదు
ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నితీష్ కుమార్ రెడ్డిని 11 కోట్లకు నిలుపుకోవాలని ముందుగా ప్లాన్ చేసింది. అయితే, దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌ను నిలుపుకోవడానికి 23 కోట్లు ఖర్చు చేయడం వల్ల నితీష్ రెడ్డికి ఎక్కువ మొత్తం కేటాయించలేకపోయారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 119 కోట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నలుగురు ఆటగాళ్ల కోసం 69 కోట్లు ఖర్చు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (23 కోట్లు), కెప్టెన్ పాట్ కమిన్స్ (18 కోట్లు), అభిషేక్ శర్మ (14 కోట్లు), ట్రావిస్ హెడ్ (14 కోట్లు) వారిలో ఉన్నారు. దీంతో మిగిలిన ఆటగాళ్ల కోసం హైదరాబాద్ టీమ్ వద్ద పెద్దగా బడ్జెట్ మిగలలేదు.
45
హెన్రిచ్ క్లాసెన్
హెన్రిచ్ క్లాసెన్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయిన నితీష్ కుమార్ రెడ్డి
సన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్‌ను నాలుగు లేదా ఐదు కోట్లు తక్కువకు కొనుగోలు చేసి ఉంటే, మిగిలిన మొత్తం నితీష్ కుమార్ రెడ్డికి వెళ్లేది, అతన్ని 10 లేదా 11 కోట్లకు నిలుపుకునేవారు. అయితే, హైదరాబాద్ ఎలాగైనా ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే, ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే హెన్రిచ్ క్లాసెన్‌ను తీసుకోవాలని నిర్ణయించుకుంద. మొదటి రిటెన్షన్ గా క్లాసెన్ ను తీసుకుంటూ అతనికి భారీ మొత్తాన్ని కేటాయించింది. దీంతో క్లాసెన్ వల్ల నితీష్ కుమార్ రెడ్డి కొన్ని కోట్లు నష్టపోయాడు.
55
Sunrisers Hyderabad, SRH, IPL , IPL 2025
ఐపీఎల్ 2025 - సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఎవరెవరున్నారు?
రిటైన్ ప్లేయర్లు :
1. హెన్రిచ్ క్లాసెన్
2. ట్రావిస్ హెడ్
3. అభిషేక్ శర్మ
4. నితీష్ కుమార్ రెడ్డి
5. పాట్ కమిన్స్