రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ రికార్డులను బద్దలు కొట్టగల టాప్-5 భారత ప్లేయర్లు

Published : May 18, 2025, 04:42 PM IST

Test captaincy records: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. హిట్ మ్యాన్ తర్వాత భారత జట్టును ఎవరు నడిపిస్తారనే చర్చ సాగుతోంది. అయితే, రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ రికార్డులను అధిగమించే సామర్థ్యం కలిగిన ఐదుగురు భారత క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.   

PREV
16
రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ రికార్డులను బద్దలు కొట్టగల టాప్-5 భారత ప్లేయర్లు

Cricket Records: భారత టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన నాయకత్వం అందించాడు. అతని కెప్టెన్సీలో భారత్ వరుసగా రెండోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కి చేరుకుంది.

దక్షిణాఫ్రికాతో సిరీస్ డ్రా అయినప్పటికీ, రోహిత్ శర్మ తన కెప్టెన్సీతో తనదైన ముద్ర వేశాడు. అయితే, రానున్న సంవత్సరాల్లో అతని రికార్డులను అధిగమించగల ఐదుగురు భారత ఆటగాళ్లు లిస్టులో ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం. 

26
Jasprit Bumrah (Photo: BCCI/X)

1. జస్ప్రిత్ బుమ్రా

భారత పేస్ బౌలింగ్‌కు ప్రధాన ముఖంగా నిలిచిన జస్ప్రిత్ బుమ్రా ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. పలు మ్యాచ్ లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో లేని సందర్భాల్లో నాయకత్వ బాధ్యతలు తీసుకున్న బుమ్రా, జట్టు లీడర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. శారీరకంగా ఫిట్‌గా ఉంటే, అతనికి రోహిత్ కెప్టెన్సీ రికార్డులను అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
 

36
Shubman Gill

2. శుభ్‌మన్ గిల్ 

భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌గా ప్రధానంగా పరిగణించబడుతున్న గిల్, ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. 8-10 సంవత్సరాలపాటు జట్టుకు సేవలందించే సామర్థ్యం అతనిలో ఉంది. 2027 WTC ఫైనల్‌కు జట్టును నడిపించే లక్ష్యంతో గిల్ ముందడుగు వేయొచ్చు.
 

46
Rishabh Pant

3. రిషభ్ పంత్

2018లో అరంగేట్రం చేసిన పంత్ బ్యాట్‌తోనూ, వికెట్‌ కీపింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని వయస్సు, అనుభవం, ఆటతీరు, వికెట్ కీపింగ్ ఇలా చాలా అంశాలను రిషబ్ పంత్ ను కెప్టెన్ రేసులో ఉంచుతున్నాయి. భారత టెస్టు జట్టుకు కెప్టెన్ అయితే, పంత్  రోహిత్ కెప్టెన్సీ రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంటుంది. 
 

56
KL Rahul

4. కేఎల్ రాహుల్

2022లో దక్షిణాఫ్రికాపై కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన రాహుల్, ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచులకు నాయకత్వం వహించాడు. ఇందులో రెండు మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌పై విజయాలు కూడా ఉన్నాయి. బ్యాటింగ్ అనుభవం, వికెట్ కీపింగ్ సామర్థ్యంతో పాటు నాయకత్వ నైపుణ్యం కూడా ఉండటంతో బలమైన పోటీ దారుగా ఉన్నాడు. రాహుల్ కెప్టెన్ అయితే, రోహిత్ కెప్టెన్సీ రికార్డులు అధిగమించే ఛాన్స్ ఉంది. 
 

66
Shreyas Iyera (Photo: PBKS Media)

5. శ్రేయస్ అయ్యర్
ప్రస్తుతం టెస్ట్ జట్టులో లేనప్పటికీ, ఇంగ్లాండ్‌తో జూన్‌లో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో శ్రేయస్ తిరిగి జట్టులోకి రావచ్చు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్‌ను మూడో టైటిల్‌కు నడిపిన శ్రేయస్, సీనియర్ ఆటగాళ్లు లేని సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు పంజాబ్ కింగ్స్ టీమ్ ను తనదైన కెప్టెన్సీతో ముందుకు నడిపిస్తున్నాడు. 

Read more Photos on
click me!