ఐపీఎల్ 2025: దుమ్మురేపుతామంటున్న 4 స్టార్ విదేశీ ప్లేయర్లు

Published : Jan 28, 2025, 09:43 PM IST

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుందని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఛైర్మన్ వరుణ్ ధమాల్ తెలిపారు.

PREV
15
ఐపీఎల్ 2025: దుమ్మురేపుతామంటున్న 4 స్టార్ విదేశీ ప్లేయర్లు
IPL 2025లో నలుగురు గేమ్ ఛేంజర్స్

ప్రతి సంవత్సరం భారతదేశంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఆకర్షిస్తుంది. అత్యంత ఖరీదైన టోర్నీలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఐపీఎల్ కు భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మస్తు క్రేజ్ ఉంటుంది. ఈ మెగా టోర్నీలో మార్చి 21న ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇది పూర్తయిన వెంటనే ఐపీఎల్ సంగ్రామం మొదలుకానుంది.

ప్రతి ఐపీఎల్ జట్టు నలుగురు విదేశీ ఆటగాళ్లను బరిలోకి దింపవచ్చు. వీరు తరచుగా జట్టు విజయానికి కీలకమైన అనుభవజ్ఞులైన పవర్ హిట్టర్లు. ఈ లిస్టులోని కొంతమంది ఆటగాళ్లకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విదేశీ ఆటగాళ్ళు IPL 2025లో దుమ్మురేపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నలుగురు ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

25

ట్రావిస్ హెడ్

భారతీయ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన ప్లేయర్ ట్రావిస్ హెడ్. ఎందుకంటే ఇటీవల 50 ఓవర్ల ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లలో భారత్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి టీమిండియా ఓటమికి కారణంగా ఉన్నాడు. అయితే, ఈ ప్లేయర్ ఐపీఎల్ లో ఆడుతుంటే అతనికి చాలా మంది భారత ప్లేయర్లు ఉన్నారు.

ట్రావిస్ హెడ్ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. గత సీజన్ లో తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. IPL 2024లో దుమ్మురేపే ఆటతో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలతో సహా 567 పరుగులు చేసి, SRH సెమీ-ఫైనల్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరోసారి ఆ జట్టు అతన్ని రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది. రాబోయే సీజన్ లో కూడా పరుగుల సునామీ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు.

35

జోస్ బట్లర్

ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ధనాధన్ ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు. అద్భుతమైన ఆటతో రాణిస్తున్న ఈ ప్లేయర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ లో పరుగుల వరదపారించాలని చూస్తున్నాడు. ఐపీఎల్ లో బట్లర్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున చాలా కాలం ఆడాడు. అయితే, వచ్చే సీజన్ కోసం అతన్ని ఆ జట్టు వదులుకుంది. 

రాజస్థాన్ రాయల్స్ తరపున చాలా కాలంగా ఆడుతున్న జోస్ బట్లర్ గత సీజన్‌లో రెండు సెంచరీలతో 359 పరుగులు చేశాడు. అయితే, రాజస్థాన్ విడుదల చేయగా, అతన్ని గుజరాత్ టైటాన్స్ ₹15.75 కోట్లకు కొనుగోలు చేసింది. గుజరాత్ తరపున కూడా అతను రాజస్థాన్ హీరోయిక్స్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు.

45

డెవాన్ కాన్వే

న్యూజిలాండ్‌ స్టార్ ప్లేయర్ డేవాన్ కాన్వే కూడా రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ లో సూపర్ షో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ లో డెవాన్ కాన్వే చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. చెన్నై టీమ్ లో కీలక బ్యాట్స్‌మన్ గా ఉన్నాడు. గాయం కారణంగా 2024 IPLని కోల్పోయాడు. అంతకుముందు, 2023లో ఆరు అర్ధ సెంచరీలతో సహా 672 పరుగులతో డేవాన్ కాన్వే ఆకట్టుకున్నాడు.

స్పిన్ ఆడటంలో మాస్టర్ అయిన డేవాన్ కాన్వే బ్యాటింగ్ చెన్నై స్పిన్-ఫ్రెండ్లీ పిచ్‌లకు సరిపోతుంది. దీంతో ఈ సీజన్‌లో అతని నుంచి అద్భుతమైన ప్రదర్శనలు వస్తాయని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఆశిస్తున్నారు.

55

జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్

23 ఏళ్ల ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను 2024 IPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. తన తొలి సీజన్‌లోనే నాలుగు అర్ధ సెంచరీలతో సహా 330 పరుగులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదటి బంతి నుంచే నిర్భయంగా బ్యాటింగ్ చేయడం అతని బలం. ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా అతను తన దూకుడు తో పరుగుల వరద పారించాలని చూస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories