అరుదైన మైలురాయి.. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా

Published : Jan 28, 2025, 07:46 PM ISTUpdated : Jan 28, 2025, 08:42 PM IST

Jasprit Bumrah: భార‌త స్టార్ పేస‌ర్ జస్ప్రీత్ బుమ్రా మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. అద్భుత‌మైన ఆట‌తో సంచ‌ల‌నం రేపుతున్న బుమ్రా ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా నిలిచాడు. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డును గెలుచుకున్నాడు. 

PREV
15
అరుదైన మైలురాయి.. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా
Image Credit: Getty Images

Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేస‌ర్ జస్ప్రీత్ బుమ్రాకు 2024 అనేక‌ చిరస్మరణీయ క్ష‌ణాల‌ను అందించింది. ఈ ఏడాది అతను భార‌త జ‌ట్టుకు అద్భుత‌మైన విజ‌యాలు అందించ‌డంతో పాటు ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ క్ర‌మంలోనే మ‌రో ఘ‌త‌న సాధించాడు. 

ఇటీవల బుమ్రాకు ఐసీసీ 'టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు లభించింది. ఇప్పుడు బుమ్రాకు సర్ 'గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ'ని కూడా అందజేయనున్నారు. ఇది సంవత్సరపు అత్యుత్తమ క్రికెటర్‌కి ఐసీసీ ఇచ్చే అరుదైన‌ గౌరవం. ఈ టైటిల్‌ను గెలుచుకున్న 5వ భారత ఆటగాడిగా బుమ్రా నిలిచాడు.

25
Image Credit: Getty Images

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ బుమ్రా ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ నిలిచాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఒక క్యాలెండర్ సంవత్సరంలో అన్ని అంతర్జాతీయ ఫార్మాట్‌లలో అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ప్లేయ‌ర్ కు అందిస్తారు. 

ఈ ఘనత 2018లో విరాట్ కోహ్లి సాధించాడు. ఆ తర్వాత ఒక భారతీయుడు ఈ అవార్డును గెలుచుకోవడం ఇదే మొదటిసారి. 31 ఏళ్ల పేసర్ టెస్టుల్లో వికెట్ చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచి 2024 సంవ‌త్స‌రాన్ని అద్భుతంగా ముగించాడు. 

వెస్టిండీస్, అమెరికాలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ట్రోఫీ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. టెస్ట్ క్రికెట్‌లో 2024లో ఇతర బౌలర్ల కంటే అద్భుతమైన సగటుతో 71 వికెట్లు సాధించి కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

35

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో బుమ్రా సూపర్ షో 

దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన కీలక సిరీస్‌లలో  బుమ్రా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. భారతదేశం విజయవంతమైన టీ20 ప్రపంచ కప్ ప్రచారంలో బుమ్రా అద్భుత స‌హ‌కారం అందించాడు. 

8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టి, 4.17 ఎకానమీ రేటుతో అతను భారత విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఐర్లాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్ వంటి జట్లపై భారత్ కీలక విజయాలు సాధించడంలో బుమ్రా సూప‌ర్ బౌలింగ్ ఉప‌యోగ‌ప‌డింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో అతను 2/18తో రాణించాడు. ఈ ఐసీసీ అవార్డుతో స‌చిన్ టెండూల్క‌ర్, కోహ్లి (2018), ఆర్ అశ్విన్ (2016), రాహుల్ ద్రవిడ్ (2004)లతో సహా భారత క్రికెటర్ల ఎలైట్ గ్రూప్‌లో బుమ్రా చేరాడు.

45

ఐసీసీ అత్యుత్తమ జట్టులో బుమ్రా 

ఐసీసీ ఇటీవలే ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేసింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో బుమ్రాకు చోటుద‌క్కింది. బుమ్రా గురించి ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో 'ఐసీసీ అవార్డ్స్‌లో సంవత్సరపు ఉత్తమ పురుష క్రికెటర్‌గా సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డుకు జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. 2024 సంవత్సరంలో అతను టెస్ట్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ప్రత్యర్థి జట్లపై తన‌దైన ప్ర‌భావం చూపాడ‌ని పేర్కొంది. 

ఏడేళ్ల తర్వాత భారతీయుడి ఈ అవార్డు 

7 ఏళ్ల తర్వాత ఈ ఐసీసీ అవార్డుకు ఓ భారతీయుడిని ఎంపిక చేసింది. చివరిసారిగా విరాట్ కోహ్లీకి ఈ అవార్డు లభించింది. రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2017, 2018) ఈ అవార్డును అందుకున్నారు.

55

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బుమ్రా చరిత్ర సృష్టించాడు

బుమ్రాను ప్రశంసిస్తూ ఐసీసీ త‌న ప్ర‌క‌ట‌న‌లో 'బుమ్రా నైపుణ్యం ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ప్రతిబింబిస్తుంది, దీనిలో అతను 900 పాయింట్ల మార్కును అధిగమించాడు. సంవత్సరం చివరిలో, అతను తన పేరు మీద 907 పాయింట్లను కలిగి ఉన్నాడు, ఇది ర్యాంకింగ్ చరిత్రలో ఏ భారతీయ బౌలర్‌కైనా అత్యధికమ‌ని' పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories