ఎప్పటిలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ప్లేయర్లు అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ లిస్టులో సామ్ కుర్రాన్, బెన్ స్టోక్స్, హారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్ ముందువరుసలో ఉంటారు...
ఒక్క సీజన్ ముందుగానే జోఫ్రా ఆర్చర్‌ని కొనుగోలు చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంది ముంబై ఇండియన్స్... గాయం కారణంగా 2022 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని జోఫ్రా ఆర్చర్, రూ.8 కోట్లు తీసుకున్నాడు...
28
Image credit: Mumbai Indians/Facebook
గత సీజన్‌లో గాయంతో జోఫ్రా ఆర్చర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈసారి జస్ప్రిత్ బుమ్రా గాయంతో ముంబై ఇండియన్స్‌కి దూరం కావడంతో జోఫ్రా ఆర్చర్‌పై భారీ ఆశలే పెట్టుకుంది ముంబై ఇండియన్స్...
38
అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న వారిని అతను పూర్తిగా డిస్సప్పాయింట్ చేశాడు. ఆర్‌సీబీతో మొదటి మ్యాచ్‌లో 33 పరుగులు ఇచ్చిన జోఫ్రా ఆర్చర్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచుల్లో 42, 56 పరుగులు ఇచ్చాడు..
48
Jofra Archer
మొత్తంగా అతను ఈ సీజన్‌లో తీసింది రెండే రెండు వికెట్లు. గాయంతో సీజన్ మధ్యలో మళ్లీ స్వదేశానికి వెళ్లిపోయాడు జోఫ్రా ఆర్చర్. ఆర్చర్‌పై తన రేంజ్‌లో ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..
58
‘ముంబై ఇండియన్స్, జోఫ్రా ఆర్చర్ మీద పెట్టిన రూ.16 కోట్లు దండగే... అతను గాయంతో బాధపడుతున్నాడని తెలిసినా ముంబై ఇండియన్స్, రూ.8 కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతను ఆడతాడు, అదరగొడతాడని ఆశలు పెట్టుకుంది..
68
Jofra Archer
అయితే అతని ఏమిచ్చాడు. ఆర్చర్ ఇంకా 100 శాతం ఫిట్‌నెస్ సాధించినట్టు కనిపించడం లేదు. సీజన్ మధ్యలో అతను చికిత్స కోసం విదేశాలకు వెళ్లాడు. ఫిట్‌గా లేకపోతే అతను ఐపీఎల్ ఆడేందుకు ఎందుకు వచ్చినట్టు...
78
జోఫ్రా ఆర్చర్‌తో ముంబై ఇండియన్స్ ఓ భారీ ఢీల్ కుదుర్చుకోవాలని చూస్తోందని విన్నాను. ఇది నిజమైతే ముంబై చేసిన అతి పెద్ద తప్పిదం అవుతుంది. అతన్ని నమ్మి మోసపోకండి.
88
Image credit: PTI
పూర్తిగా ఫిట్‌గా లేని ప్లేయర్ మీద ఇలా కోట్లకు కోట్లు పోయడం వృథా.. ఆర్చర్ మాత్రమే కాదు, అతని ప్లేస్‌లో ఎవరున్నా సీజన్ మొత్తానికి అందుబాటులో లేని ప్లేయర్‌కి ఒక్క రూపాయి ఇవ్వడం కూడా దండగే...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..