యజ్వేంద్ర చాహాల్‌ని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించి ఉంటేనా... ఐపీఎల్ రికార్డుతో రోహిత్ శర్మపై ట్రోల్స్..

Published : May 12, 2023, 11:17 AM IST

రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 183 వికెట్లు తీసిన డ్వేన్ బ్రావోని అధిగమించిన యజ్వేంద్ర చాహాల్, 143 మ్యాచుల్లో 187 వికెట్లు పడగొట్టాడు..

PREV
19
యజ్వేంద్ర చాహాల్‌ని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించి ఉంటేనా... ఐపీఎల్ రికార్డుతో రోహిత్ శర్మపై ట్రోల్స్..
Yuzvendra Chahal

డ్వేన్ బ్రావ్ 161 మ్యాచుల్లో 183 వికెట్లు తీస్తే, యజ్వేంద్ర చాహాల్ 143 మ్యాచుల్లోనే అతన్ని అధిగమించేశాడు. బ్రావో బౌలింగ్ ఎకానమీ 8.38గా ఉంటే చాహాల్ ఎకానమీ 7.64గా ఉంది...

29
Yuzvendra Chahal

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన యజ్వేంద్ర చాహాల్, కోల్‌కత్తాపైన హ్యాట్రిక్ కూడా పడగొట్టాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 

39
Chahal

యజ్వేంద్ర చాహాల్ రికార్డు ఫీట్‌తో అటు ఆర్‌సీబీపై, ఇటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆర్‌సీబీలో కీ బౌలర్‌గా ఉంటూ వచ్చిన యజ్వేంద్ర చాహాల్‌ని 2022 మెగా వేలంలో విడుదల చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

49

వానిందు హసరంగ కోసం రూ.10 కోట్లు, హర్షల్ పటేల్ కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యజ్వేంద్ర చాహాల్ లాంటి మ్యాచ్ విన్నర్ కోసం రూ.7 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు...

59

హసరంగ, హర్షల్ పటేల్ ప్లేస్‌లో యజ్వేంద్ర చాహాల్ ఉన్నా... ఇప్పటిదాకా ఓడిపోయిన మ్యాచుల్లో సగం మ్యాచుల్లో అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచి ఉండేదని అంటున్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్.. ఆర్‌సీబీ నుంచి బయటికి వచ్చిన చాహాల్, 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించి ‘పర్పుల్ క్యాప్’ గెలిచాడు.

69
PTI Photo) (PTI04_02_2023_000234B)

ఐదేళ్లుగా టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు యజ్వేంద్ర చాహాల్. అయితే చాహాల్‌కి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ టీమ్‌లో చోటు దక్కలేదు...

79
PTI Photo/Kunal Patil) (PTI03_15_2023_000115B)

యజ్వేంద్ర చాహాల్, శిఖర్ ధావన్‌లను సెలక్ట్ చేయాల్సిందిగా విరాట్ కోహ్లీ సెలక్టర్లను కోరినా, మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ వారిపై ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో బీసీసీఐ పట్టించుకోలేదు..

89
Sanju Samson and Chahal

2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి యజ్వేంద్ర చాహాల్‌ని సెలక్ట్ చేసింది బీసీసీఐ. అయితే రోహిత్ శర్మ మాత్రం చాహాల్‌కి తుది జట్టులో చోటు కూడా ఇవ్వలేదు. ఫ్రీగా హానీమూన్‌కి వెళ్లినట్టు చాహాల్, తన భార్యతో కలిసి ఆస్ట్రేలియా మొత్తం తిరిగి... ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఇండియాకి తిరిగి వచ్చాడు..

99
PTI Photo/Kunal Patil)(PTI01_07_2023_000276B)

యజ్వేంద్ర చాహాల్‌ని సంజూ శాంసన్ వాడుకున్నట్టు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, లేదా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వాడుకుంటే భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో అదరగొట్టడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు అభిమానులు.. 

click me!

Recommended Stories